మణిపూసల భావాలు ;-భూపని పావని 9వZphs నేరళ్లపల్లి, మహబూబ్ నగర్, 7013264464
 1.
కార్తీక పౌర్ణములు
ఇంటింటా వ్రథములు
చీకట్లో వెలుగులు
అద్భుత సంబరాలు
2.
చాచా నెహ్రు పిల్లలం
వికసించినా సొగసులం
అల్లరి కేరింతలతో
అందమైనా బాలలం
3.
అమృతపుఘనీ మా అమ్మ
అతి మధురమే మాఅమ్మ
అమూల్యమైన ఆస్తిగా 
భగవంతుని సృష్టి అమ్మ
4.
ఇంటింటా పిల్లలం
సమాజoలొ వెలుగులం
చదువులోన చురుకుగా 
సాగుతున్న దివ్వెలం 
5.
తోటలోని పువ్వులు
వికసించిన నవ్వులు
ముచ్చటైన మాటలతో 
అందమైన సొగసులు
6.
సంక్రాంతీ పండుగ
కళ్లాపు చల్లెనుగ
రంగుల ముగ్గు వేస్తే 
ఆనందం నిండగ
7.
హోలీ భలే పండుగా
రంగుల పువ్వులు తేగా
వావీ వరుసలు మరచి 
అందరాటను ఆడగా
8.
మేమందరం  పిల్లలం
అందమైనా మల్లెలం
ఆనందం మా సొత్తుగ
అల్లరి చేయు పిడుగులం
9
రసాయనాలా ఎరువులు
నాశనం చేయు  పంటలు
సహజమైన ఎరువులే 
పంట ఇచ్చెను లాభాలు
10.
ఊరంత ఉత్సవాలు
ఇంటింటా చుట్టాలు
భలే రుచుల వంటలతో 
హాయిగా సంబరాలు 
11.
పండుగలూ వచ్చేను
కొత్త బట్ట లిచ్చేను
అందరినేకం చేసి 
సంబరమే తెచ్చేను
12.
వర్షం పడుతుందoడి 
ఆడుకొనగ రారండి 
పడవలు చేద్దాం పిల్లలు
నీటిలొ వదులుదామండి 
13.
మృషలాడటం కన్నా
మేలు చేయుట మిన్నా
చెడు దారి వదలండి 
మంచి చదువులు మిన్నా
14.
చిట్టి చిట్టీ  కథలు
అందమైన కవితలు 
సిరాచుక్క నద్దిన 
సమాజాన వెలుగులు
15.
మంచి మంచి చదువులు
మా బడిలో చదువులు
ఉపాధ్యాయుల పలుకులే 
మా చెవులకు విందులు
16.
ఇంటింటా దీపాలు
ఊరంతటా వెలుగులు
చీకటిని తరిమేసే 
ఆనంద ఉత్సవాలు
17.
ఆడపిల్లను  చూస్తివి
చెడుగ  ప్రవర్తించితివి
తప్పు చేయ బోయీ 
శిక్ష నీవు భరిస్తివి
18.
ముగిసాయిగా పొద్దులు
అయ్యేనుగా రాత్రులు
ఉషోదయాన కలలతో 
నెరవేర్చాలి ఆశలు
19.
కుంరంభీం ధీరుడు
పోరు బాట వీరుడు
నాయకత్వ పటిమతో 
గిరిజనులకు ఒక్కడు
20
మా అక్కకూ పెళ్ళంట
పచ్చనైన పందిరంట
పందిట్లో గాజులను 
అందరూ తొడిగారంట
21.
రామ్మా చిలుకమ్మా
రంగుల మొలకమ్మా
ఎర్రనీ మూతితో
తియ్యని పాటమ్మా
22.
చారవాణి అంటారు
ఆటలోనె  ఉంటారు
టిక్టాక్లు అనుకుంటూ 
జీవితం  కోల్పోదురు
23.
రామ్మ సీతాకోకమ్మ
రంగురంగుల చిలకమ్మ 
నిలకడనే లేకుండా 
ఇక్కడికే పరుగులమ్మ 
24.
నీటినీ పొదుపు చేద్దాం
ఇంకుడు గుంతలు తీద్దాం
ఆనకట్టలు కట్టేసి 
నీటినీ కాపాడుదాం
25.
పరిశుభ్రతగ ఉండాలి
సానిటైజర్ వాడాలి
మాస్కు తప్పక ధరించి 
జాగ్రత్తగా ఉండాలి 
 26.
ఇష్టంగాను చదువుకో
అమ్మ నాన్నను చూసుకో
ఉద్యోగo తెచ్చుకొని 
ఇంటి పేరును నిలుపుకో 
27.
పువ్వులండీ పువ్వులు
రంగు రంగుల మల్లెలు
మా తోటలో విరిసిన 
పరిమళాల విరజాజులు 
28.
ఆడపిల్లనె కంటారు
చదువులను వద్దంటారు
కష్టాల పాల జేస్తూ 
సుఖాన్నీ బంధిస్తారు
29.
డబ్బుందని మురవకు
మధ్యం సేవించకు
దాని బానిసగా మారి 
జీవితo కోల్పోకు
30.
ఆడపిల్లల నందరు 
వివక్షగా చూస్తారు 
హక్కులను కాలరాసి 
బానిసనూ చేస్తారు 
31.
అబ్బాయిల నొదిలేస్తరు
అమ్మాయిలకే అందరు 
క్రమశిక్షణ పేరుతోను 
రూల్సు లెన్నో పెడతారు 
32.
కులం మతం చూడకోయి 
భేదాలను పెంచకోయి 
అంతా సమానమనుకొని 
అందరితో  ఉండవోయి 
33.
లంచం తీసుకోకోయి 
నిజాయితీగ ఓటేయి 
మత్తులోన పడకుండా 
మహాత్మాగా వెలుగోయి 
34.
చెట్లను నరికినోడు 
మొక్కలు పెంచనోడు 
కాలుష్య కారకుడై 
ప్రకృతికి చేయు కీడు 
35.
కూ..కూ..ఓ కోయిలమ్మ
అందమైన  కోయిలమ్మ
తీయని గానంతో 
అందరిని మురిపించమ్మ 
36.
అమ్మాయిని చూడకూరా!
చెడునూ ఊహించకురా!
చెల్లెలుగా భావించి 
అండగానూ నుండరా!
37
స్త్రీలనూ బాధించుట 
వారిని అణగదొక్కుట 
ఆ ఇంటికే అరిష్టం 
ఆమె కన్నీరొలుకుట 
38.
ఎగిరే ఎగిరే జెండా!
మువ్వన్నెల మా జెండా!   
దేశభక్తి ఊపిరిగా 
మా సoస్కృతికి  అండా!
39.
బతుకమ్మా బతుకమ్మ
మా బడిలో బతుకమ్మ
సంబరాలు నింపావు 
పోయిరా!బతుకమ్మ
40.
రంగు రంగుల బతుకమ్మ
మా పువ్వులా బతుకమ్మ
ఏటేట నీవ్ రావమ్మ
ఆనందమే పంచమ్మ

కామెంట్‌లు
Unknown చెప్పారు…
చాలా బాగా వ్రాసావు పావనీ...
నీ భావాలు బాగున్నాయి👌💐💐💐
శుభాశీస్సులు