అగ్గిపుల్ల (బాల సాహిత్యం)--ఎం. వి. ఉమాదేవి బాలగేయాలు
అమ్మమ్మో అగ్గిపుల్లా 
ఎండల్లో భయం పిల్లా 
గీయరాదు  పిల్లలెల్లా 
మంటలకే దూరమిల్లా !!

బట్టల దగ్గర గీయరాదు 
ఆటకి మంట వాడరాదు 
కట్టెల పొయ్యి దగ్గరలో 
కిరోసిన్ డబ్బా ఉంచరాదు !!

బీడీ సిగిరెట్ పీకలను 
ఆర్పక విసురుట నేరమౌను 
పూరిపాకలలో జాగ్రత్తగ
దీపం ప్రమిదలుంచవలెను !!

అగ్ని దహించును అన్నిటిని 
బుగ్గిని చేయును సర్వాన్ని 
నిప్పుతో చెలగాటం కూడదు 
చెప్పాలి పిల్లలకి జాగ్రత్తని !!

కామెంట్‌లు