నేను భూమిని;- ప్రతాప్ కౌటిళ్యా
నేను భూమిని 
భామను కాను
పిల్లల్ని కన లేను
ఉన్నది ఒకటే భూమి !?

మీ వారసులు
వానరులను
సహజ వనరులను
ఇచ్చింది నేను!!?

మీ వారసులకు
మీరేం ఇస్తారు!?

ఇల్లు ఇస్తారు కారుస్తారు
కరెన్సీ ఇస్తారు
బామని ఇస్తారు
కానీ భూమినిస్తారా!?

మట్టిని సారం లేకుండా చేశారు
గాలిని మలినం చేశారు
నీటిని నిల్వలేకుండా చేశారు!!?
భూగోళాన్ని గందరగోళం చేశారు!!

బొగ్గును తవ్వారు
ఇనుమును తవ్వారు
ఇంధనం తవ్వారు
బంగారం తవ్వారు!!?
భూగోళాన్ని గందరగోళం చేశారు!!

మిగిలింది కాసులు
మట్టి కాదు
మట్టి మనుషులు కాదు !!?

మట్టిని రక్షించండి
మంచి గాలిని పీల్చండి
భూగర్భ జలాన్ని పెంచండి
చెట్లను పెంచండి!!?

మీ పిల్లలు పట్టణాలు కాదు
పల్లెలు కావాలి
భూమిని అందమైన 
భామల చూసుకోండి !!?

మీ బర్త్ సర్టిఫికెట్
ఎర్త్ మాత్రమే ఇవ్వాలి జాగ్రత్త!!?

ఎర్త్ డేను పురస్క

రించుకుని

Pratapkoutilya lecturer in Bio-Chem palem nagarkurnool dist 🙏
8309529273
కామెంట్‌లు