ఉత్పలమాల
1. ఎద్దును నెక్కి లోకముల; నేలెదవీశ్వర లోకబాంధవా!
ముద్దుగ భక్తకోటికిని; ముక్తినొసంగెడి ముక్తిదాయకా!
శ్రద్ధగ వేడభక్తులకు; చక్కగ సౌఖ్యము కల్గజేతువో!
కద్దులు బాపు శంకరుడ; కావు ,,మమ్ముల నీలకంధ రా! .
2. ఉత్పలమాల
కాశిని నిల్చి భక్తులను; కావదలంచిన కాశినాథుడా!
మూషిక వాహనండు కడు మోదము తోడను వేడు చుండగన్
దోషములు లెల్ల బాపియును దూరము చేసియు పాపకర్మలన్
పోషణజేయువాడవని మ్రొక్కితివేగమె గౌరినాథుడా
3. ఉత్పలమాల
భక్తులు గొల్చివేడినను; భారము నీవుగనిల్చి బ్రోచెవే
యుక్తియు లేని వారలను; నుర్విన రక్షణ జేయుచుంటివే
ముక్తినియిచ్చె దేవుడవు; మూఢులనైనను మెచ్చియీశ్వరా!
రక్తిగ గొల్వ భక్తులకు; రాజ్య సుఖంబులు గల్గజేతువే !.
4. చంపకమాల
హరహర మూర్తి శంకరుడ; నా పద బాంధవ సంపదివ్వరా!
బిరబిర రావ సన్నిధికి; భీకర రుద్రుడ కాలభైరవా!
చరణము నమ్మినాను మది; శంకర నీ దయ రాద శంభుడా! .
5. ఉత్పలమాల
మల్లిక నాథ రావయిటు; మానస మందలి కోర్కె దీర్చగన్
నెల్లజగంబులేలెదవు; నెన్నడు నీమది జాలిగల్గునో!
నుల్లము నందు వేడనిను ; నుండెదవెప్పుడు నా మనంబులో
చల్లగ రావ శంకరుడ; చక్కగ గొల్తును పాదపద్మముల్ .
===========================
మచ్చ అనురాధ
యస్.ఏ.తెలుగు
జి.ప.ఉ.పా.కుకునూర్ పల్లి, కొండపాక మండలం, సిద్దిపేట జిల్లా.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి