స్వాతంత్య్ర సంగ్రామచరిత్ర లోనే కాదు... భారత దేశ చరిత్ర లోనే అత్యంత దురదృష్టకర... దుర్మార్గ సంఘటన !
వెయ్యి మంది ప్రాణాలను హరించి, రెండువేల మందిని
తీవ్రoగా గాయపరచిన దు రా గతం... !!
డయ్యర్ పైసాచి కత్వాని కి
పరాకాష్ట...!
స్వర్ణ దేవాలయం సాక్షిగా...
జలియనువాలాబాగుతోటలో
జరిగిన నరమేధం !
భారతదేశానికి స్వాతంత్య్రం రావాలనే ఆశ, సంబంధం లేని యుద్దానికి ... నలుబదిఏడువే ల మంది భారతీయ సైనికుల
బలి దానం !
సహకరించక వ్యతిరేకించిన
బెoగాల్,పంజాబ్ లపై...కన్నెర్ర జేసిన తెల్ల దొరతనం!
ప్రాధమిక హక్కులను కాల రాచి, తిరుగు బాట్లను ఉక్కు పాదాలతో అణచివేసేఆలోచనే
హడల గొట్టే ప్రయత్న మే... ఈ మారణ కాండ !
కుట్రపూరిత రౌలట్ చట్ట వ్యతిరేకతను సహించలేని
దురహంకార మదానికి దర్పణ
మిది !
స్వాతంత్ర్య సంగ్రామముతీవ్ర రూపముదాల్చి, దాస్య సృoఖ లాలను త్రెంచి,తెల్లవారిని తరిమి కొట్టుటకు నాంది యైనది ! ఐనా....,
చరిత్రపుటలలో ఈ పేజీ రక్తసిక్తమై...ఆవేదనను కలిగి స్తునే యున్నది...వీడని పీడ కలలా !!
*******
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి