ప్రాచీన భాషలు ఆవిర్భావం ;-- బెహరా ఉమామహేశ్వరరావు
 మనిషి సాధించిన పురోభివృద్ధిలో గ్రామాలు పట్టణాలుగా ఏర్పడ్డాయి. అయోధ్య మిథిలా వంటి అనేక నగరాలు వెలిశాయి. అటువంటి పెద్ద నగరాలు
ఆనాటి దేశాలకు రాజధానులయ్యాయి.
    రాజ్యానికి రాజులు పరిపాలకులుగా ఉండేవారు.
మంత్రితో పాటు పాలన సంఘాలు ఉండేవి. సంస్కృత భాష పాలనా భాషగా ఉండేది.
 సంస్కృత భాష, రాజభాషగా గుర్తింపబడింది.
అయినా నా జనులు మాట్లాడే భాషలు అనేకం; ఉత్తర భారతదేశంలో బెలాన్, నర్మదా, చంబల్,ఫోన్,
సబర్మతి, బ్రాహ్మణ, బ్రాహ్మణీ వంటి అనేక భాషలు
ప్రాంతీయ భాషలుగా ఉండేవి. ఈ భాషలలో చాలా బాగాటికి  లిపి కూడా లేదు.
అలాగే దక్షిణాదిలో ఈలమైట్,బుడగు, ఇరుళ,తొడ,
కొణిక్కరణ్,కొడుకు,కొరగ వంటి భాషలలో ప్రజలు మాట్లాడుకునే వ్యవహారిక భాషలు.
   ఏది ఏమైనా పండితుల భాషగా రాజస్థానాలలో 
సంస్కృత భాష ప్రచారంలో ఉండేది. ఈ భాషను
దేవ భాష మరియు రాజ భాష అని పిలిచేవారు.
 సంస్కృత లిపిని దేవనాగరి లిపిగా అభివర్ణించే వారు. గొప్ప గ్రంథాలన్నీ కూడా సంస్కృతంలోనే రాయబడ్డాయి.యివన్నీ కూడా తాళపత్రాలలో చంప బడ్డాయి.
 సంస్కృత భాషా గ్రంథాలలో శ్రీమద్రామాయణం ప్రథమ గ్రంథం. వాల్మీకి ఆదికవి.
‌    వాల్మీకి రాసిన రామచరితమే శ్రీమద్రామాయణం
శ్రీరాముని జీవిత చరిత్ర ఘనతను   చాటే మహోన్నత కావ్యంగా నేటికీ విరాజిల్లుతోంది. క్రీస్తు పూర్వము కొన్ని వేల సంవత్సరాలకు పూర్వమే రాయబడింది. విశేషం ఏమంటే రామాయణంలో మొదటి కాండము. బాలకాండ; అంటే బాల సాహిత్యమే కదా!
ఆనాడు సూర్యవంశ చక్రవర్తులు చంద్రవంశ చక్రవర్తులు గొప్పతనాన్ని చాటే గ్రంథాలు వెలిసాయి.
సూర్యవంశం, చక్రవర్తులే ఇక్ష్వాకు వంశంవార
ఇక్ష్వాకు వంశంలో గొప్పవాడు శ్రీరాముడు. వారి వంశ వృక్షం పరిశీలిస్తే ఆ వంశ చక్రవర్తులందరూ
సఛ్చరితులే. ఆ వంశపు రాజులు అందరూ పురాణ పురుషులుగా నేటికీ నిలిచారు. వారి చరిత్రలు సంస్కృతంలో లిఖింప బడ్డాయి. ఆ తర్వాత తెలుగు కన్నడం వంటీ అనేక భారతీయ భాషల్లో అనువదింప బడినాయి. భారతీయ భాషల పురోభివృద్ధికి రామాయణ,మ్స భారత ఇతిహాసాలే మూల కారణం.

కామెంట్‌లు