ఈ మజిలీలో నాతోనే; -నెల్లుట్ల సునీత--ఖమ్మం
నా కవిత అనుభవం నేర్పిన విలువల పాఠాలను బోధిస్తుంది.

అమృతవర్షిణి లేఖినై శ్వేత పత్రాలపై అక్షర సుధలను  చిలకరిస్తుంది.

ఊహల వేటలోఉత్తుంగ తరంగమై
ఉవ్వెత్తునఎగిసి పడి
 గగన అంచును తాకి వస్తుంది.

సమాజ హితాన్ని కాంక్షిస్తూ మనసు మాటున భావాల నిధులను వెలికి తీస్తుంది.

గుప్పెడు అక్షర బీజాలు కవన సాగులో శ్రమ జీవుల కోసం సరికొత్తగా ప్రతిరోజు మొలకెత్తుతుంది.

అందాల అలంకారాలతో అక్షర కుసుమాల  మాలనల్లి భారతి సిగలో ముడుస్తుంది.

పాలకడలి నురుగుల పొంగుతూ శరవేగంతో నదిలా పరిగెడ్తుంది.
గుండె కవటాలని తాకుతూ అక్షర చైతన్యంమై జ్వలిస్తుంది.

అప్పుడప్పుడు
పదబంధ విన్యాసాల్లా  అలరిస్తుంది.
గగనపు వీధిలోంచి జాలువారే వర్షపు చినుకులా ఆణిముత్యమై మెరుస్తుంది.

నింగి వాకిట పరిచిన రంగవల్లిక ఇంద్ర ధనస్సులా... నయనానందం చేస్తుంది.

మనసు పడిన వేదనను సృజిస్తుంది
సమస్య మూలాలను అన్వేషిస్తుంది.
 నిగుడా అర్థాలను నర్మగర్భంగా ప్రతిబింబిస్తూ....
అక్షర సంగమ మిళితమై దర్శనమిస్తుంది.

సున్నిత పదాలతో మనసు మాటున పెనవేసుకున్న భావాల కవనాలతో
ఆత్మీయమై తియ్యగా పలకరిస్తుంది.

ఆశయాలకు ఊపిరి పోస్తూ
లక్ష్యాల పరిమళాలను వెదజల్లుతూ
విజయహాసాల జల్లులు కురిపిస్తుంది.
అలతి అలతి పదాలతో అరుదైన నాకైత పదాల చాటునుంచే పలకరిస్తుంది.
సాహితీ సుగంధమై మనసు పొరలలో  దాగుండి
దోబుచులాడుతూ మనోల్లాసమై నవ్యతను పులుముతుంది.
సామాజిక రుగ్మతలకు సందేశం ఇస్తూ... ఎన్నో కావ్యాలను లిఖిస్తుంది.

స్వాంతన చేకూర్చే ఆత్మీయ బంధమై
ఈ మజిలీలో నాతోనే పయనిస్తుంది.

కామెంట్‌లు