* సుగమంచేస్తాయి *
*****
అరవైఏడేళ్ల జీవితానుభవాలు ఒక్కొక్కటీ ఒక్కో పేజీయై....
108 పేజీల నాబ్రతుకుబాట ఓ పాఠ్య పుస్తకoగాతయారైంది
ఒక్కో పేజీలో ఒక్కో సంఘట న, ఒక్కో అనుభవం,ప్రతిపేజీ...
నాకో పాఠమే !
తియ్యగా పులకింప జేసే వాటికన్నా,చేదుగా బాధపెడు తూ అనుభవింప జేసేవేఎక్కువ
ఎన్నెన్ని పరిచయాలు !ఎన్నెన్ని గుణపాఠాలు !!
పరిశీలించక గానీ... అధ్యయన దృష్టితో చూడగలి గితే...ప్రతిజీవితమూ ఓ పాఠ్య పుస్తకమే !
అందుకే...మనంమనపూర్వుల
జీవిత గ్రంధాలను చదవాలి !
అవి మన జీవన గమనాన్ని సుగమం చేస్తాయి !
******
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి