సునంద భాషితం;-వురిమళ్ల సునంద, ఖమ్మం
 కదలిక...మెదలక...
*****
దేహం ఆరోగ్యంగా ఉండాలంటే కదలిక ఎంతో అవసరం.
ఒకే చోట స్థిరంగా కూర్చోవడం,కదలిక లేకపోవటం వల్ల అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి.
 
అందుకే....శరీరాన్ని కదలని నీరులా ఉండనివ్వొద్దు.నడక, వ్యాయామం, యోగాసనాలు లాంటి వాటితో ప్రవాహించే సెలయేరులా చైతన్యవంతం  చేసుకోవాలి.
 మనసును  'మెదలకుండా'ఎలాంటి వ్యామోహాలకు లోను కానివ్వకుండా,స్థిరంగా ఉండేలా చూసుకోవాలి.
 అంతులేని కోరికల వెనుక అదే పనిగా పరుగెడుతూ వుంటే ఆనందం మృగ్యమై పోతుంది. అసంతృప్తి  మనోవేదనకు గురిచేస్తుంది.
 
అందుకే...  శరీరాన్నేమో కదిలిస్తూ, మనసునేమో ఉన్న దానితో ఆత్మ తృప్తి పొందేలా  మెదలకుండా, స్థిరంగా ఉండేలా చూసుకుంటే.. ఆరోగ్యం, ఆనందం  నిత్యం మన వెంటే..
 ప్రభాత కిరణాల నమస్సులతో🙏


కామెంట్‌లు
బాగున్నాయి మీ సూచనలు

గజవెళ్ళి శ్రీనివాసాచారి