శనీశ్వరుడు . పురాణ బేతాళ కథ.; - డాక్టర్ . బెల్లంకొండ నాగేశ్వర రావు , చెన్నై

 విక్రమార్కుడు చెట్టువద్దకుచేరి శవాన్ని ఆవహించి ఉన్నబేతాళుని బంధించి భుజంపైనచేర్చుకుని నడవసాగాడు.
అప్పుడు శవంలోని బేతాళుడు ' మహరాజా నీ పట్టుదలమెచ్చదగినదే నాకు శనీశ్వరుని  గురించి తెలియజేయి. తెలిసి చెప్పకపోయావో మరణిస్తావు'అన్నాడు.
' బేతాళా శనివారం లేదా స్థిరవారం  అనేది వారంలో ఏడవ చివరి రోజు. ఇది శుక్రవారంనకు, ఆదివారంనకు మధ్యలో ఉంటుంది. కొన్ని సంస్కృతులలో ఇది వారాంతంలో మొదటి రోజుగా పరిగణిస్తుంటారు. కొన్ని దేశాలలో శనివారాన్ని కూడా (ఆదివారంతో పాటుగా) సెలవుదినంగా పాటిస్తారు. కొంత మంది ఈ రోజుని చెడుదినంగా విశ్వసించి, కొత్త పనులు ప్రారంభించరు.హిందూ పురాణాల ప్రకారం శనిదేవుని పేరు మీదుగా ఇది శనివారం అని పిలువబడుతుంది.హిందువులు శనివారంను శ్రీ వేంకటేశ్వరునికి పవిత్రమైన రోజుగా భావిస్తారు.శనికి అంకితం చేయబడిన దేవాలయాలు ఉన్నవి.శనిని విల్లు, బాణాలు మోసే రాబందును నడుపుతున్న దేవతగా ప్రాతినిధ్యం వహిస్తాడు.
శని హిందూ పురాణల ప్రకారం శని సూర్యుడు,చాయాదేవికి జన్మించిన సంతానం,యముడుకు సోదరుడు.ఛాయాపుత్రుడని అనే మరో పేరుకూడా ఉంది.దురదృష్టకర సంఘటన జరిగినప్పుడు, దానిని తరచుగా శని శాపం అని, లేదా సని దాపురించదని అంటుంటారు.ఇది వాస్తవానికి తప్పుదారి పట్టించేదిగా శని భావిస్తాడు.శని ప్రజలను తనిఖీ చేస్తాడు.జీవితంలో చేసిన దుశ్చర్యల పర్యవసానాలకు ప్రజలు బాధపెడతాడని శని నమ్ముతాడు. అతని పాత్ర అన్ని జీవులకు న్యాయం చేయడమే.
కృతయుగంలో నారదుడు కైలాసానికి పరమేశ్వరుడు దర్శనార్థం వెళ్లి, నవగ్రహాల్లో ఒకటైన శనిగ్రహ బలాన్ని గురించి చెప్తాడు.శనిదేవుడిని నారదుడు అలా ప్రశంసించడం పరమేశ్వరుని నచ్చదు.శనివారంనాడు శనీశ్వరుడిని పూజిస్తే ఏలిననాటి అష్టమ శనిదోషాలు తొలగిపోతాయి అని చెపుతాడు.అంతటి శక్తివంతుడైతే శని ప్రభావాన్ని తనపై చూపించి, తన శక్తి సామర్థ్యాలను నిరూపించుకోమని శివుడు నారదుడితో చెప్తాడు.శనిఈ విషయం నారదుడు తెలుసుకుని, శివపరమాత్మను ఒక్క క్షణమైనా పట్టి పీడిస్తానని శివుడుకు కబురు పంపిస్తాడు. శని గర్వం అణచాలని కైలాసం నుంచి శివుడు మాయమై దండకారణ్యంలోని ఒక చెట్టు తొర్రలో తపస్సు చేస్తుంటాడు. మరుసటి రోజు ఈశ్వరుడు కళ్లు తెరిచి చూసేసరికి శని ఎదురుగా నిలబడి ఈశ్వరుడికి నమస్కరిస్తూ కనపడతాడు. అప్పుడు ఈశ్వరుడు నీ శపథం ఏమైందని ప్రశ్నిస్తాడు.
దానికి శనీశ్వరుడు ముల్లోకాలకు అధిపతి, సకల చరాచర జీవరాశులకు ఆరాధ్య దైవం అయిన మీరు కైలాసం నుంచి పారిపోయి, దండకారణ్యంలో పరుగులు పెట్టి, దిక్కులేని వాడిలా చెట్టు తొర్రలో దాచుకోవడం శని పట్టినట్లు కదే అని తన అబిప్రాయాన్ని వెల్లడిస్తాడు.దీంతో తనను పట్టిపీడించడంలో సత్తా చాటినందుకు, తనను మెప్పించిన శనికి ఆనాటినుండి ఈశ్వర అనే శబ్దం సార్థకం కాగలదని, మానవులు తనను శనీశ్వరా అని పూజిస్తే, శని తరపున పరమశివుడు ఆశీస్సులు ఇస్తానని వరం ఇచ్చాడు. అలా శనిగ్రహం శనీశ్వరుడు అయ్యాడని పురాణాలు చెప్తున్నాయి.
శనిగ్రహం ప్రభావం వలన కలిగే శని చెడు ప్రభావాన్ని తగ్గించడానికి శనివారం అంకితం చేయబడింది. ప్రధానంగా హిందూ జ్యోతిషశాస్త్రంలో నమ్మకం ఉన్నవారు ఈ రోజు శని వ్రతాన్ని చేసుకుంటారు.నలుపు రంగు
 దుస్తులుతో శనేశ్వరుని ఆలయం లేదా నవగ్రహాలు ఉన్న పుణ్యక్షేత్రాలు దర్శిస్తారు ముఖ్యంగా జ్యోతిషశాస్త్రంలో నమ్మకం ఉన్నహిందువులు శనికి భయపడతారు. ఆ భయం,చెడు ప్రభావాలు,కష్టాలు వైదొలగటానికి భయం పోగొట్టటానికి ప్రతీకగా భావించే హనుమంతుడు ఆలయాన్ని దర్శిస్తారు.హనుమంతుని ఆశీర్వాదం ఉన్నవారు శని కోపం నుండి రక్షించబడతారని నమ్ముతారు. శనివారం జరిగే కష్టాలు, దురదృష్టాలను నివారించడానికి భక్తులు చాలా మంది ఆరోజు ఉపవాసం పాటిస్తారు.శనివారం ఉపవాసం శ్రీవెంకటేశ్వరస్వామికి అంకితం చేయబడింది.శనికి ప్రియమైన నువ్వులు నూనె,నల్ల నువ్వులు,నల్ల బట్టలు,నల్లపెసలు మొదలగునవి (నలుపు రంగు కలవి) ఆలయాలలో ఇస్తారు.శని విగ్రహం రంగు నలుపు రంగులోనే ఉంటుంది.ఆ రోజున ఉప్పును చాలా మందికి దూరంగా ఉంచుతారు.నువ్వుల నూనె, నల్ల బట్టలు వంటి నల్ల రంగు వస్తువులను కూడా శనివారం రోజు దానం చేస్తారు.కొత్తగా చేపట్టే పనులను శనివారం మొదలుపెట్టరు.ఆరోజు కష్టాలనుండి రక్షించుకోవటానికి, పూర్తిగా శనిదేవుడును ప్రసన్నం చేసుకోవటానికి ఉపయోగించాలనే భక్తుల నమ్మకం.
శనితో సహా తొమ్మిది గ్రహ దేవతల విగ్రహాలు నవగ్రహాలు అనే పేరుతో అన్ని దేవలయాలలో ఉంటాయి.
శనివారంనాడు చేయకూడని పనులు
శనేశ్వరుడుకు ప్రీతిపాత్రమైన నల్లనువ్వులు,నువ్వుల నూనె,నల్లపెసలు,నల్లబట్టలు శనివారంనాడు ఇంటికి తీసుకురారు.
శనేశ్వరుడు పూజ సందర్బంగా దానం ఇవ్వబడే ఆకు కూరలు ఇంటికి తీసుకువెళ్లరు 'అన్నాడు విక్రమార్కుడు.
అతనికి మౌనభగంకావడంతో, శవంతోసహా మాయమైన బేతాళుడు తిరిగి చెట్టువద్దకు చేరాడు.పట్టువదలనివిక్రమార్కుడు బేతాళునికై వెనుతిరిగాడు.
కామెంట్‌లు