కాంచవోయి నేటి తెలుగు దుస్థితి;-గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
తెలుగుతల్లిపోయె
సవితితల్లివచ్చె
సంప్రదాయాలుపోయె
సంబరాలుపోయె 

అసలైన పదహారణాలతెలుగోడు
అణాకానీలతోపాటు పోయాడు
పంచెకట్టు వదిలాడు
పైకండువా విడిచాడు

అచ్చతెనుగు పోయింది
మచ్చతెలుగు వచ్చింది
మనకు ఆంగ్లమాద్యమమొచ్చింది
మూడోబాషగా హిందీతలకెక్కింది

గురుశిష్యులబంధాలు తెగిపోయాయి
ప్రభుత్వపాఠశాలలు వెనకబడ్డాయి
వాణిజ్య విద్యాసంస్థలొచ్చాయి
మాతృబాషబోధన తగ్గిపోయింది

పల్లెలు పాడైపోయాయి
పల్లెనుండివలసలు పెరిగాయి
పట్నవాసాలు పెరిగిపోయాయి
ప్రేమాభిమానాలు తరిగిపోయాయి

హరికథలు పోయాయి
బుఱ్ఱకథలు పోయాయి
వీధిభాగవతాలు పోయాయి
నాటకాలు పోయాయి

చుట్టలు పోయాయి
బీడీలు పోయాయి
మద్యాలు వచ్చాయి
మత్తుపదర్ధాలు వచ్చాయి

జట్కాలు పోయాయి
రిక్షాలు పోయాయి
సైకిల్లు పోయాయి
నడకలు పోయాయి

విదేశచదువులు పెరిగాయి
పరదేశ ఉద్యోగాలుపెరిగాయి
ప్రవాసబ్రతుకులు పెరిగాయి
ప్రపంచ ప్రయాణాలుపెరిగాయి

అమ్మానాన్నలు పోయారు
మమ్మీడాడీలు వచ్చారు
అనాధాశ్రమాలు పెరిగాయి
అనారోగ్యాలు పెరిగాయి

ఆకాశవాణి పోయింది
దూరదర్శని వచ్చింది
భూతలఫోను పోయింది
చరవాణి వచ్చింది

పావడాలు పోయాయి
పరికిణీలు పోయాయి
పైటలు పోయాయి
చీరకట్టులు పోయాయి

వాలుజడలు పోయాయి
పూలజడలు పోయాయి
వయ్యారాలు పోయాయి
వదినామరదల్ల సరసాలుపోయాయి

ఉమ్మడి కుటుంబాలు 
పోయాయి
కుటుంబ కట్టుబాట్లు
పోయాయి

ఆడామగా అంతరం తెలియుటలేదు
అమ్మాయిలు అబ్బాయిల దుస్తులేస్తున్నారు
అంతేనా మగవారు మగువలరంగుబట్టలేస్తున్నారు
ఆచారవ్యవహారాలకు తిలోదకాలిచ్చారు

బాంధవ్యాలు పోయాయి
విడాకులు పెరిగాయి
వేరుకాపురాలు పెరిగాయి
సహజీవనాలు పెరిగాయి

కలిసిన తెలుగొళ్ళు
కలహించి విడిపోయారు
కలలుకన్న బంధాలు
కనుమరుగయ్యాయి

తెలుగుదనము పోయింది
వెలుగుదనము పోయింది
ఆంధ్రత్వం పోయింది
శూరత్వం పోయింది

తెలుగువారందరూ
నిజాన్ని తెలుసుకోవాలి 
తెలుగుప్రజలందరూ
ఏకమై ముందుకునడవాలి

===========================================

(తెలుగువారందరు నా బాధను అర్ధంచేసుకుంటారని ప్రాంతీయతత్వాన్ని ప్రక్కనబెట్టి ఆలోచిస్తారని, మనకు మనతెలుగుకు ముందుముందు మంచిరోజులు రావాలని ఆశిస్తున్నాను)

కామెంట్‌లు
Srinivasa Rao Samrajyam చెప్పారు…
ప్రసాద్ గారి తెలుగు దుస్థితి కవిత వాత్సవానికి అద్దం పట్టినట్టుంది.
చాలా బాగుంది. ఇటువంటి కవితలు చూసైనా
పరిస్థితులు మారుతాయి అని ఆశించవొచ్చు. మరికొన్ని కవితలు ఇలాగే రచించి తెలుగు వారిని చైతన్య పరుస్తారని ఆశిస్తున్నాము.