జీరో... హీరో...
*******
బాల్యంలో చిన్న జీరో లాంటి వృత్తంలో అమ్మ చుట్టే తిరిగిన మనం అమ్మ ఒడిలో అల్లారు ముద్దుగా, నాన్న చేయి పట్టుకుని పెరుగుతూ ఒక్కటొక్కటిగా నేర్చుకుంటాం.
అనుకరణ, అనుసరణ, ఆసక్తి, ఆరాటం, ఆలోచనలే పంచ ప్రాణాలు గా ప్రపంచాన్ని పరికిస్తూ, మనదైన వ్యక్తిత్వాన్ని రూపొందించుకుంటాం.
ఎక్కడో జీరో నుండి మొదలైన మనం హీరోగా సమాజంలో మన ఉనికిని చాటుతూ అస్తిత్వ జెండా ఎగరేస్తాం.
లెక్కలతో, బతుకులోని అనుభవాల పద్దులతో,జీవన శైలి సూత్రాలతో,మనసునిండా నింపుకున్న మేధస్సుతో,విశాల ప్రపంచాన్ని ఇముడ్చుకున్న భూగోళంతో, నిత్యం చైతన్యాన్ని ఇచ్చే సూర్యునితో,పండువెన్నెలతో పరవశింప జేసే జాబిల్లితో పోల్చుతూ...
అకుంఠిత దీక్షతో కుడి వైపు విలువల జీవన వృత్తాలను చేర్చుకుంటూ అంచెలంచెలుగా ఎదిగి పోవచ్చని,జీరో ఎప్పుడూ హీరోనే అని ఋజువు చేస్తాం.
ప్రభాత కిరణాల నమస్సులతో🙏

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి