'ఆ' ఇద్దరు --కె. కవిత, హైదరాబాద్
  తన మనవరాళ్లకు  వేదంతసూరి  అందించిన అద్భుతమైన కానుక. 'ఆ' ఇద్దరు బాలల నవల-వారి కుటుంబంలోని తరతరాల కు ఇదొక మధురమైన జ్ఞాపకంగా నిలుస్తుంది.న్యూజిలాండ్ యాత్ర విశేషాలతో పాటు తన మనవరాళ్లతో ఉన్న అనుబంధాన్ని పుస్తకరూపంలో పదిలపరచడం ఒక గొప్ప ఆలోచన.. తెలుగు బాల సాహిత్యం లో ఇది ఒక అపురూపమైన పుస్తకం. ఇందులో చిన్నారుల చిలిపి చేష్టలతో పాటు ఆటపాటల ద్వారా ఎన్నో నేర్చుకుంటారని, పెద్దలను అనుక్షణం గమనిస్తూ అనుకరిస్తుంటారు, అందుకే  పెద్దలు పిల్లల పట్ల ప్రేమగా ఉండడంతోపాటు తమ నడవడికలో జాగ్రత్తగా వ్యవహరించాలనే విషయం రచయిత  సునిశితంగా సూచన చేసారు .  అదేవిధంగా  బాల్యం లోనే పిల్లలకు క్రమశిక్షణతోపాటు పుస్తక పఠనం వంటి చక్కని అలవాట్లను నేర్పించాలనే విషయం ప్రస్తావించడం పెద్దలందరికి స్ఫూర్తిదాయకం. "ఆద్య పుస్తకం చదువుతుంది, ఏవైనా పండుగలొస్తే గ్రీటింగ్ కార్డులు  తయారు చేస్తుంది , ఆద్య,ఆరియా ఒకరిపట్ల ఒకరు ప్రేమగా ఉంటారు "అని రచయిత గారు తన మనవరాళ్ల గురించి వివరించడం జరిగింది. ఆద్య ఇంత చిన్నతనంలో అంతటి చక్కని అలవాట్లు కలిగి ఉండటం చాలా గొప్ప విషయం.వారి తల్లిదండ్రులకి హృదయపూర్వక అభినందనలు.న్యూజిలాండ్ పాఠశాలల్లో పుస్తక పఠనం తప్పనిసరి. ,కుకింగ్ క్లాస్ కూడా ఉండడం,ఒత్తిడి లేకుండా స్వేచ్ఛా వాతావరణంలో పిల్లలు పాఠ్యాంశాలు చదువుకోగలగడం వారి వ్యక్తిత్వ వికాసానికి ఎంతగానో దోహదపడుతుంది. పిల్లల మనోభావాలను దృష్టిలో ఉంచుకుని రచయితలు బాలసాహిత్యానికి ప్రాముఖ్యత ఇవ్వాల్సిన అవసరం ఉందని వేదంతసూరి వ్యక్తపరిచిన అభిప్రాయం ఆలోచింపజేసింది.
ఆద్య, ఆరియా అనే అక్కాచెల్లెళ్లిద్దరి గురించి 'ఆ'ఇద్దరు చిన్నారుల చక్కటి అనుబంధాన్ని అక్షరరూపంలో పదిలపరచడమనేది నానమ్మ ,తాతయ్యలుగా ఈ ఇద్దరి తపన,తాపత్రయం ఎందరికో ఆదర్శంగా నిలిచింది. పుస్తకం చదువుతూ...చదువుతూ...నేను మా పాప చిన్ననాటి జ్ఞాపకాలను కూడా గుర్తు చేసుకున్నాను.  తీరిక సమయంలో పిల్లలతో అప్పుడప్పుడు వారి చిన్ననాటి జ్ఞాపకాలను పంచుకున్నప్పుడు వారు పొందే ఆనందాన్ని చూసి పెద్దలుగా మనం కూడా గత జ్ఞాపకాల్లోకి వెళ్లడం సహజం.ఇటువంటి జ్ఞాపకాలను భద్రపరుచుకోవడం అవసరం అనే అభిప్రాయం ఈ పుస్తకం చదివిన తరువాత మరికొంత బలపడింది.
ప్రకృతి ఒడిలో పెద్దలే కాదు పిల్లలు కూడా సేద తీరుతారన్న విషయాన్ని గ్రహించి చిన్నపిల్లలను పచ్చదనానికి చేరువలో ఆడించాలని తద్వారా జీవరాశులను ప్రేమించడం కూడా నేర్పాలని రచయిత అభిప్రాయపడటంలో మనమంతా ప్రకృతిలో భాగమేనన్న అక్షర సత్యం పాఠకులందరికి బోధపడటంతోపాటు ప్రకృతి పట్ల మనందరికున్న  బాధ్యతను గుర్తుచేస్తుంది.న్యూజిలాండ్ ప్రజలలో ఉన్న నిజాయితి, మంచితనం, క్రమశిక్షణ, ఆరోగ్యంపట్ల వారికున్న శ్రద్ద మొదలైన సంగతుల ద్వారా..న్యూజిలాండ్ ప్రజలు ఆచరించే చక్కని అలవాట్లే వారిని నిరంతరం న్యూ  జీల్ తో ముందుకు నడిపిస్తాయన్న విషయాన్ని పుస్తకం తెలియపరిచింది.పిల్లలు, పెద్దలు తప్పనిసరిగా చదవవలసిన పుస్తకం, నాకు నచ్చిన పుస్తకం 'ఆ' ఇద్దరు. 
చిన్నారుల కోసం చక్కటి పుస్తకాన్ని అందించిన వేదాంతసూరి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ వారు ఇటువంటి అమూల్యమైన పుస్తకాలు మరెన్నో రచించాలని మనస్ఫూర్తిగా  కోరుకుంటున్నాను.;

కామెంట్‌లు
Unknown చెప్పారు…
చక్కని ఆలోచన👌
మనవరాళ్లకు పుస్తక బహుమతి
రచయితకు,సమీక్షకురాలికి
అభినందనలు💐💐💐💐💐💐💐💐
Unknown చెప్పారు…
ఈ పుస్తకం వెల మరియు దొరికే
చిరునామా ఇవ్వగలరు.
vedanta sury చెప్పారు…
Price Rs 100/-
Prasan publications
House number 1-9-319/1/1/G2
Vijayadurga residency
Vidyanagar. Hyderabad 500044