అయిన... పరాయి..
*******
కొందరి పట్ల మన ఆలోచనలు చిత్రంగా ఉంటాయి.
వాళ్ళు దగ్గరలో ఉన్నా, లేకపోయినా మన అయిన వాళ్ళు అనుకొని ఆత్మీయత, అభిమానం కనబరుస్తూ అమితంగా గౌరవిస్తూ ఉంటాం.
అవసరాల్లో ఓదార్పును, అంతకు మించి భరోసాను వాళ్ళనుండి కోరుకుంటాం.*
ఇక మన పట్ల కొందరు చూపే గౌరవాభిమానాలను ఎందుకో మరి సందేహిస్తుంటాం. మననుండి ఏదో ఆశిస్తున్నారనే భావనతో వాళ్ళను పరాయిని చేసి పక్కన పెడుతుంటాం.
కానీ చాలా సార్లు మన అంచనాలు తల్లక్రిందులవుతుంటాయి.
అయిన అనుకున్న వాళ్ళు ఆపదలు,కష్ట సమయాల్లో ముఖం చాటేయడం, మనం పరాయి అనుకున్న వాళ్ళేమో మనకు మానసికంగా నైతికంగా ధైర్యాన్ని ఇచ్చి , మేమున్నామంటూ తోడుగా, భరోసాగా నిలవడం అనేది...మనకు ఆశ్చర్యం, ఆనందంతో పాటు పశ్చాత్తాపం కూడా కలిగిస్తాయి.
మనకు అయిన వాళ్ళెవరో,పరాయి వాళ్ళెవరో .. అప్పుడప్పుడు వచ్చే కష్టాలు,ఈతి బాధలు చెబుతాయి.
నేతి బీరకాయలో నెయ్యి, ఎండమావిలో నీరు దొరుకుతుందనే భ్రమలు వీడి ఎవరు అయినవారో,పరాయి వారో అంతరంగంతో పరిశీలిస్తేనే తెలుస్తుంది.
ప్రభాత కిరణాల నమస్సులతో🙏

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి