యువత సంకల్పం ;-ఎం. వి. ఉమాదేవి
 వివేకానంద వచనాలు స్ఫూర్తిగా 
ఉక్కు నరాలు వజ్రసంకల్పం తో 
యువతరం ముందుకు సాగాలి 
నవసమాజ నేతలై 
శక్తి యుక్తుల ప్రతినిధులుగా 
మొక్కవోని దీక్షగా 
ప్రతి ఉదయం శుభతరుణం 
ప్రతి హృదయం నవకిరణం 
అభ్యుదయపు మహానిధులు 
యువతీ యువకులవుతూ 
స్వయంకృషి, సమృద్ధి, సరసభావనల చేతన 
నవ భారతి లాస్యమయ్యి సాగాలి వెలుగుబాట !
వ్యసనాలు, నిరాశావాదం గట్టిగ త్రోసేసి.. 
కన్నవారి కలలు పండేలా.. 
జాతీయ భావన హృదినిండేలా 
యువత కి శుభోదయం !!
భవితకు మహోత్సవం !!

కామెంట్‌లు