పుస్తకం ఓ మంచి నేస్తం; -ఆచార్య అయ్యలసోమయాజుల ప్రసాద్--విశాఖపట్నం

చదువుల తల్లి ప్రతీక పుస్తకం
బాల్యం నుంచి పుస్తకపఠనం
మేధో శక్తిని పెంచును
వేమన, సుమతీ, దాశరధి శతకాలు, రామాయణ,భారత గ్రంధాలు, పంచతంత్ర కథలు తాతయ్య దగ్గర ఆరుబయట నులకమంచం మీద నేర్చుకున్న ఎందరో నైతిక ప్రవర్తన కలిగి మహానుభావులు గా అందరికి ఆదర్శవంతులైనారు...!!

నాకేదైన సంశయం, భాధ కలిగినప్పుడు భగవద్గీత నివృత్తి చేసిందన్న స్వామి వివేకానంద, బాలగంగాధర్ తిలక్, మహాత్మా గాంధీలు
వసుదైక కుటుంబానికే 
చిరస్మరణీయులు...!!

సాంకేతికత పెరిగి చరవాణిలు అందుబాటులోకి వచ్చినా
పుస్తకపఠనం ధారణా శక్తిని
మేధస్సును ,మానసిక ఆహ్లాదమును పెంచునని శాస్త్రజ్ఞులు ప్రయోగరీత్యా తెలియచేయుట ముదావహం.
పుస్తకం హస్త భూషణం
చింకి బట్టయిన కట్టుకో
మంచి పుస్తకాన్ని వదలకు అన్నది పాటిద్దాం.
పుస్తకమే మంచి నేస్తం అన్నది వసుదైక కుటుంబానికి చాటుదాం..!!
( ప్రపంచ పుస్తక దినోత్సవం  
   సందర్భంగా )

...........................
కామెంట్‌లు
అజ్ఞాత చెప్పారు…
చాలా చాలా బాగుంది సార్ చక్కగా పుస్తకం గురించి వివరించారు.. రాథోడ్