తెలుసుకుందాం!సేకరణ..అచ్యుతుని రాజ్యశ్రీ

మనం ఒళ్లు వెచ్చగా ఉండి శరీరం తోటకూర కాడలా వేలాడి విసుగ్గా ఉంటే జ్వరం వచ్చింది అని అంటాం.హిందీలో కూడా జ్వర్ బుఖార్ అని అంటారు. కానీ దాని అసలు అర్ధం ఏంటో తెలుసా? ఆవిరి పొగ వెలువడటం అని. ఇది అరబ్బీ భాషలో ఉంది. మరి ఆవిరి వేడిగా ఉంటుంది. జ్వరం వస్తే ఒళ్లు వెచ్చబడుతుంది.ఫారశీభాషలోకూడా ఇవే అర్ధాలు.అవే హిందీ భాషలోజ్వరంగా వాడుకలోకి వచ్చింది.జీ కా బుఖార్ అనేసామెత హిందీ లో ఉంది. దీని అర్ధం కోపం శోకం దు:ఖం!
బిసాత్ అనేఅరబ్ భాషాపదం కి అర్ధం కింద పరిచే దుప్పటి  లేక  బట్ట అని అర్ధం. ప్రాచీన కాలంలో చిన్న చిన్న వ్యాపారులు నేలపై బట్టను పరిచి రకరకాల వస్తువులు అమ్మకం కోసం పెట్టేవారు.దాన్ని బిసాత్ అని  ఆవ్యాపారిని బిసాతీ అనేవారు. క్రమంగా చదరంగం  ఆటకి వాడే  గవ్వల ఆటకి వాడే బట్టని బిసాత్ అనటం వాడుకలోకి వచ్చింది. బట్ట పరిచి దానిపై కంచం పెట్టుకొని భోజనం చేసేవారు. ఇప్పుడు టేబుల్ మీల్స్ వచ్చాయనుకోండి.ఇప్పుడు దాని అర్ధం పూర్తి గా మారి ఖర్చు చేసే సామర్థ్యంగా వాడుతున్నారు 🌹
కామెంట్‌లు