విలువైనది "పుస్తకం";---గద్వాల సోమన్న ,ఎమ్మిగనూరు
విలువైనది పుస్తకం
వెలిగించును మస్తకం
చదువరులకు తెలియజేయు
సమాచార సమస్తం

పంచుతుంది వినోదం
పెంచుతుంది వికాసం
ఏకాగ్రతతో చదివిన
దొరుకును హృదయానందం

ఇల విజ్ఞాన వారధి
విజయానికి సారథి
పుస్తకాల సన్నిధి
జీవితాన పెన్నిధి

స్నేహిస్తే జతగాడు
చేరదీస్తే చెలికాడు
పుస్తకం మగధీరుడు
జ్ఞానమున కుబేరుడు

పుస్తకానికి జేజేలు
నుతులు వేనవేలు
పుస్తకం బహు మేలు
దగ్గరుంటే చాలు
(పుస్తక దినోత్సవం సందర్భంగా..)
.

కామెంట్‌లు