అలాఅయితే ..ఎలా ?--డా.కె.ఎల్.వి.ప్రసాద్.--హన్మకొండ .
గ్రూపులకు 
లోటులేదు 
మనకి .....!

సభ్యులు 
వేలసంఖ్యలో
నమోదు !,

రాసేవాళ్ళని
మాత్రం--
వేల్లమీద
లెక్కపెట్టవచ్చు !

చాలమంది 
రాసినదాంట్లో 
అక్షరదోషాలు 
అతిఎక్కువ ...!

అయినా
అడ్మిన్ల పొగడ్తలకు
అక్కడ-
లోటుండదు !

ఐనవాళ్లు 
దూరమౌతారనేమో 
ముహవాటం 
మాస్కుతగిలించుకుని 
పొగడ్తల జాబితాలో 
ముందుంటారు ..!

లైకులుకొట్టేవాల్లు
అందులో --
కొంతమంది ...!

మళ్లీఅందులో ...
చదవకుండా 
మొహమాటానికి 
లైకేవాళ్లు ....
మరికొంతమంది !

అక్షరదోషాలు 
సరిదిద్దుకోకుండా ,
వాక్యనిర్మాణం 
సరిచూసుకోకుండా 
లైకులు -కామెంట్లు 
ఆశించేవాళ్ళు ...
ఎంతమందో .....!!
          ***

కామెంట్‌లు