రండి (బాలగేయం);-- డా.గౌరవరాజు సతీష్ కుమార్.
రండి రండి బాలల్లార
మీరంతా రండీ
పిల్లలంత చదవండీ
దేశ భవిత మీదండీ !!రండి!!

బడి అంటే భయం వద్దు 
బడి అంటే కలుగు ముద్దు
బడి అంటే అమ్మ ఒడే కదరా 
అది దేవుని గుడే కదరా !!రండి!!

మీబాల్యం

అపురూపం
మీ మనసే నవనీతం 
మీరంతా చదివితే
దేశమే నందనం !!రండి!!

మీరే గద మా ఆశలు
మీరే గద మా భాషలు
మీరే మా కంటి పాపలూ 
మీకే మా ఆశీస్సులూ !!రండి!!

కామెంట్‌లు