ఆయుర్వేదం వైద్యం కాదు ఆహారం!? ప్రతాప్ కౌటిళ్యా
 మనం జంతు వృక్ష పదార్థాలు ఏవి తీసుకున్న అందులో పిండి పదార్థాలు మాంసకృత్తులు కొవ్వుపదార్ధలుంటావీ.
ఇవి అన్ని జీర్ణాశయంలో గ్లూకోజ్ గా మారి రక్తంలో కలిసి కణాలలోకి చేరి జీవ రసాయన క్రియలు జరిగీ ఏటీపీ మీ శక్తి గా మారుతావి.
జంతు వృక్ష కణాలు ఏవైనా గ్లూకోజ్ గా మారి శక్తిని ఇవ్వడానికి మాత్రమే పనికి వస్తాయి తప్పా కణాలకు దాని యంత్రాంగం జరగడానికి కేవలం ఇంధనంగా మాత్రమే కానీ జీవక్రియలకు జరిగిన ఆటంకాలకు యంత్రంగా డ్యామేజీ పునరుద్ధరించే జీవ రసాయనాలను ఇవ్వదు. అంటే అన్ని రసాయనాలు ఆహారంలో ఉండవు. అందుకే ఆయుర్వేదము అంతా ఆహారమే కానీ వైద్యం కాలేకపోయింది.
ఆహారము అంటే ఏమిటి వైద్యం అంటే ఏమిటి!!?
ఆహారము అంటే కణానికి శక్తినిస్తుంది వైద్యం అంటే రిపేర్ఆఫ్ ది సెల్ మెకానిజం.
కణము దాని యంత్రాంగం కోసం ఆహారం అవసరం.
కణాలు దాని యంత్రాంగం రిపేర్ కోసం వైద్యం అవసరం.
ఆహారం ద్వారా ఎనర్జీ ని ఉత్పత్తి చేస్తాం కానీ కణాల యంత్రాంగాన్ని రిపేర్ చేయలేం.
అంటే ఆహారం ద్వారా వైద్యం చేయలేము
వైద్యం చేయాలంటే కణాల యంత్రాంగానికి కావలసిన జీవ రసాయనాల మాలిక్యూల్స్ కావాలి. అది నేరుగా కణాల యంత్రాంగాన్ని మాలిక్యులార్ లెవెల్లో రిపేర్ చేసి  జీవక్రియను కొనసాగిస్తుంది.
ఆహారము కణానికీ శక్తిని ఇస్తే, వైద్యము కణాలయంత్రాంగాన్ని నియంత్రిస్తుంది.
కణాల యంత్రాంగము జీవక్రియలు అన్ని రసాయనాలు జీవరసాయన లే కాబట్టి జీవక్రియలను నియంత్రించడానికి జీవ రసాయనాలు మాలిక్యులార్ లెవెల్లో ముఖ్యం అవి నేరుగా ఆహారం ద్వారా పొందలేము. మాలిక్యూల్స్ రూపంలోనే అందించాలి.
మొక్కల ద్వారా ఆయుర్వేదం ఏర్పడింది అది కూడా ఆహారం లాగా మాత్రమే పనిచేస్తుంది తప్ప నేరుగా రసాయనాలను మాలిక్యులర్ గా మార్చి జీవక్రియలకు కణాల యంత్రాంగానికి అందించలేదు.
అందుకే ఆయుర్వేద వైద్యం కూడా అల్లోపతి వైద్యం గా మారింది. అంటే రసాయనాలు గానే కన యంత్రాంగానికి జీవ రసాయన చర్యలకు కు ఉపయోగపడుతుందని అర్థమవుతుంది. అంటే మాలిక్యులార్ లెవెల్ లో మాత్రమే వైద్యం చేయడానికి అవకాశం ఉంది అది ఆహారం ద్వారా సాధ్యం కాదు. మాలిక్యూల్స్ ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. ఆయుర్వేదం ఆహారం మాత్రంగానే ఉపయోగపడుతుంది.
Dedicated to my beloved sisters Rukmini and Padmavati
Pratapkoutilya lecturer in Bio-Chem palem nagarkurnool dist
8309529273

కామెంట్‌లు