సునంద భాషితం;-వురిమళ్ల సునంద, ఖమ్మం
ఆనందం.. ఐశ్వర్యం..
**††*†**
ఆనందం కోరని మనిషి, ఐశ్వర్యం వద్దనే వ్యక్తి ఉంటాడా ఈ లోకంలో..
ప్రతివారూ జీవితమంతా తపించేది చిటికెడు ఆనందం కోసమే.
కొందరు బతుకంతా అన్నింటినీ వదిలేసి శ్రమించేది, ఐశ్వర్యంలో ఆనందం ఉందనే భ్రమ లోనే..
అవసరానికి మించిన ఐశ్వర్యం ఆనందం ఇస్తుందా అనేది ఆలోచించాలి..
దానిని  ఎలా జాగ్రత్త చేయాలనే ఆలోచనే ఉన్న ఆనందాన్ని ఉష్ కాకి చేస్తుంది.
ఎవరొచ్చి కొల్లగొడతారో, సంపాదించిన దాన్నెలా దాచుకోవాలో తెలియక,అభద్రతా భావంతో ,భయం భయంగా బతికేలా చేస్తుంది.
అతి ఐశ్వర్యం ఆనందానికి ఎప్పుడూ శత్రువే..
అందుకే సంపాదించిన ఐశ్వర్యంలో కొంతైనా సమాజ శ్రేయస్సుకు ఉపయోగిస్తే  ఆనందం, ఆత్మ తృప్తి  మనసు దరి చేరుతుంది.
ప్రభాత కిరణాల నమస్సులతో🙏
 

కామెంట్‌లు