******
. వాత్సల్యంతో
***
సూర్యునిలో పెరిగెను
కోప, తాపాలు !
అగ్ని గుండంగామారుతున్న
భూగోళం !!
తట్టుకోలేని జనం హాహాకారం
వాత్సల్యంతో ప్రకృతిమాత ప్రేమగా ...అందిస్తోంది...తియ్యనిమామిడిపండ్లు,చల్లనికర్బూజాలు... తాటి ముంజులు... !
*******
ఎందుకంతకోపం !?
****
భూగోళo పొయ్యిమీది పెనం లా కాలి పోతోంది !
నూతులు, చెరువులు ఎండి పోయాయి !
ఒంట్లో నీరంతా చెమటై...
కారిపోయింది !
మనుషులే కాదు..., పశు, పక్ష్యాదులు సైతం నీటికోసం
అల్లాడి పోతున్నాయి !
సూర్యునికెందు కంత కోపం ?!
మనుషుల్లో నిర్లక్ష్యం
పెరిగిపోతోoదని !
******

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి