అభయదాత ;-అరుణ కుమారి;-కలం స్నేహం
శోక సముద్రం మునిగిరి 
సీతా రాములు
వారిని కలిపిన ఘనత నీదేగదా
అంగుళీయకం ఇచ్చి
చూడామణిని తెచ్చి
మాట సాయం చేసావు
భయం పోగొట్టావు సీతమ్మ
తల్లికి
 అడ్డువచ్చిన రక్కసుల
దునుమాడి
చూసి రమ్మంటే కాల్చి వచ్చావు
దూతవంటే నువ్వేలే ఆంజనేయా 
లక్ష్మణుడు మూర్ఛపోవ
సంజీవ పర్వతమే తెచ్చి
అభయ ప్రదాతవైనావు
సంజీవరాయడా
 తమలపాకులు పూజ
నీకిష్టమయ్యా
వడమాల వేస్తేను కోరికలు తీర్చేవు
ప్రదక్షిణాలు చేస్తేను ఫలితాలు ఇచ్చేవు
చిరంజీవివి నీవు ఇప్పటికీ ఉన్నావు
ఎప్పటికీ ఉంటావు మా అండ నీవే
రామ నామం చెప్తే చాలు పొంగి
పోతావు
నిజమైన రామ బంటువి నువ్వేనయ్యా
పాండవుల జెండాపై కపిరాజువై
వెలిసావు
నిన్ను  ఎరుగ  సాధ్యమా మాకు
శ్రీ ఆంజనేయా, ప్రసన్నాంజనే యా
అభయమిచ్చి కాపాడు అభయాంజనేయా 🙏🏼


కామెంట్‌లు