#అంతర్జాతీయనృత్యదినోత్సవం; - శ్రీదేవి రమేష్


నాకు సంప్రదాయ నృత్యం నేర్చుకోవాలని అనిపించి మొదలుపెట్టింది  గురువు గారు కళాతపస్వి కాశినాథుని విశ్వనాథ్ గారి సాగరసంగమం చిత్రం చూశాక 🙏
కళ తప్పి సంగీత కళాశాలలు విద్యార్థులు లేక వెల వెల పోతున్నసమయంలో విశ్వనాథ్ గారి శంకరాభరణం సినిమా రావడం.ఆ సినిమా చూశాక సంగీత పాఠశాలలు విద్యార్థులతో నిండి  పూర్వ కళావైభవం పొందడం తెలుగు చరిత్రలో స్వర్ణాక్షరాలతో లిఖించబడే సత్యం🙏
నా స్వానుభవం నేను  స్కూల్ లో చదువుతున్నప్పుడు సాగరసంగమం సినిమా వచ్చింది. అది ఎన్నిసార్లు చూసానో నాకు గుర్తు లేదు🙏
 ఈ చిత్రం లో సంప్రదాయ నృత్యాల ప్రాధాన్యత ,అవి కాపాడుకోవడం కోసం వివిధ  కోణాల్లో కథానాయకుడు పడ్డ తపన మనకు స్పష్టంగా తెలుస్తుంది. తల్లిని అమితంగా ప్రేమించే కొడుకులా, మంచి స్నేహితుడిగా ,నిస్వార్ధమైన ప్రేమికుడిలా ,గొప్ప నాట్యాచార్యుడిగా అన్నింటినీ మించి నృత్యమే ప్రాణంగా భావించి No End For Any Art , కళలకు అంతం అనేది ఉండదు అని నిరూపించారు. ఈ సినిమా చూసేవారి మనస్సుకు హత్తుకునేట్టు ఉన్న  అమూల్యమైన ఆణిముత్యం లాంటి సినిమా సాగరసంగమం🙏
నాకు నృత్య పరంగా నచ్చిన సినిమా స్వర్ణకమలం,సిరిసిరి మువ్వ,ఆనంద భైరవి, మయూరి కూడా. కానీ సాగరసంగమం లో ఉన్న వివిధ కోణాలు నా మనస్సుకి హత్తుకున్నాయి🙏
ఆ సినిమా ప్రభావం నా మీద ఎంతలా పడింది అంటే. సినిమా చూడగానే కూచిపూడి నృత్యం నేర్చుకోవడం మొదలుపెట్టాను. నా గురువు గార్లు శ్రీమతి భ్రమరాంబ గారు వారి చెల్లెల్లు శ్రీమతి అఖిలాండేశ్వరి గారు శ్రీమతి జ్వాలాముఖి గారు🙏,
వారికి నేను సదా ఋణపడి వుంటాను.ఎందుకంటే నేను దాదాపు గురుకులం పద్ధతిలో నేర్చుకున్నాను వారి వద్ద🙏 వారి తోబుట్టువుల నన్ను చూసుకున్నారు. మొదటిసారి జ్వాలాముఖి అక్కతో వారి నృత్య సాధన కోసం కూచిపూడి కి వెళ్ళి 4,5 రోజులు  ఉన్నాము.
మా బ్యాచ్  మొదటి అరంగేట్రం వరంగల్ లోని కాకతీయ మెడికల్ కాలేజి ఆడిటోరియం లో జరిగింది.
మాకు కూచిపూడి తో పాటు జానపద నృత్యం కూడా నేర్పించేవారు. నేను కాలేజి రోజుల్లో ప్రతి ఏడు ప్రధమ బహుమతి పొందేదాన్ని.😊
 ఇంకో అమూల్యమైన జ్ఞాపకం ఏంటంటే.ప్రముఖ జానపద సంగీత గాయకులు ,సినిగాయకులు  మా వరంగల్ వాసులు అయిన శ్రీ సారంగపాణి గారు శ్రీ శంకర్ గారు జానపద పాటలు పాడితే మేము జానపద నృత్యాలు చేసేవాళ్ళం 😊🙏
ఆ తర్వాతి కాలంలో నేను నెహ్రు యువ కేంద్ర లో   National Service Volunteer గా చేసాను. అప్పుడు ఎన్నో రాష్ట్రాలు పర్యటించాను.😊
వివిధ రాష్ట్రాల సంస్కృతి, సాంప్రదాయాలు అక్కడ ప్రదర్శించాలి.నేను National integration camps లో  మన తెలుగు రాష్ట్రo సంప్రదాయ,జానపద నృత్యం చేసేదాన్ని. అలా ఓసారి తమిళనాడు లోని గాంధీ గ్రామ్ లో నేను కూచిపూడి నృత్యం చేసినప్పటి ఫోటో ఇది😊
దురదృష్టం ఏమిటంటే నేను ఎప్పుడూ ఏ ప్రోగ్రాం అయినా నా ఫోటోలు  తీసుకోలేదు☹️
ఈరోజు ఎదో చూస్తుంటే ఈ ఫోటో కనిపించింది😊
కాలచక్రం నా బాల్యంలోకి తొంగిచూసి ఈ అమూల్యమైన జ్ఞాపకాన్ని నాకు అందించింది💐🌹💐😊
 No End For Any Art అని నేను కూడా మా గురువు గారిలా నమ్ముతాను🙏
ఇప్పుడు కూడా చెన్నై లో అడపాదడపా అవకాశం ఉన్నప్పుడు పాటలు, నృత్యం, నాటకాలు వేస్తూ కళను దైవంలా భావిస్తున్నాను🙏.
 ఆ భగవంతుడి అనుగ్రహం,లలితమ్మ దయ,గురువుల దీవెనలు, సహృదయులైన మిత్రులు,శ్రేయోభిలాషుల వలన ఏదైనా చేయగలుగుతున్నాను🙏నా ప్రతి అడుగులో వారి సహాయసహకరం అందిస్తున్నవారు మా వారు Dr. L. S. Ramesh గారు🙏 వారికి సదా కృతజ్ఞతలు🙏
సర్వేజనాః సుఖినోభవంతు🙏
కామెంట్‌లు