"నీ జ్ఞాపకం నాతోనే "1980(ధారావాహిక 17,వ బాగం)--నాగమణి రావులపాటి "
 ఇంతలో పెళ్ళి కూతురు మిమ్మల్ని పిలుస్తోంది
కుసుమ గారు అని ఒక అమ్మాయి చెప్పింది
లేచి నిలుచుంది కుసుమ అది చూసి దారిలో నుంచున్నాడు రాహుల్ అప్పుడే చూస్తున్నట్టు
ముఖం పెట్టి ఆశ్చర్యంగా చూసింది కుసుమ
ఏమండీ కాస్త జరుగుతారా అని అనేసరికి
రాహుల్  చిరునవ్వు నవ్వుతూ పక్కకు జరిగాడు
తను అందంగా తయారై దేవకన్యలా
వున్నావని చెప్పాలని తెగ ఆరాట పడ్డాడు
ఇదేమీ పట్టనట్టు ఒయ్యారాలు ఒలకబోస్తూ
పెళ్ళికూతురు గదిలోకి వెళ్ళింది కుసుమ
అమ్మో ఈ ఆడపిల్లలున్నారే ఎంత టెంపరో
నువ్వెవడో నాకు తేలియదు అన్నట్టు
ఫోజులు కొడుతూ ఎలా వెళుతోందో అయినా
ఇంతమంది లో  అందంలో కుసుమ
గోటికి కూడా ఎవరూ సాటిరారు అని మనసులో
తెగ పొగుడు కొన్నాడు కుసుమను
కుసుమ వెళ్ళేసరికి పెళ్ళికొడుకు రాహుల్ ను
ఇంకా ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్స్ ను పిలుస్తున్నాడు
ఓహో అబ్బాయి గారు పెళ్ళికొడుకు ఫ్రెండ్
అన్నమాట సరిపోయింది ఇద్దరిదీ ఒకే గమ్యం
ఇంతలో రాహుల్ అతనిని కలిసాడు ఏమిటీ
పిలిచావు అని అడిగాడు రాహుల్
నా కాబోయే వైఫ్ ను పరిచయం చేస్తాను 
రండిరా అని అనేసరికి అందరూ గదిలోకి
రావటం చూసి ఏంటబ్బా అందరూ కట్ట
కట్టుకుని ఈగదిలోకి వచ్చారు అని 
తెల్లబోయింది కుసుమ పెళ్ళికూతురు
ఇదిగోండి మా మామయ్య కూతురు కుసుమ
ఇద్దరం స్కూల్ మెట్స్ అది చాలా తెలివిగలది
స్కూల్ ఫస్ట్ అని గర్వంగా కుసుమను
పరిచయం చేసింది నమస్కారం కుసుమ గారు
అని అన్నాడు పెళ్ళికొడుకు ఇదిగోండి వీడు రాహుల్
నా బెస్ట్ ఫ్రెండ్ వీళ్ళంతా నా ఫ్రెండ్స్ అని
పరిచయం చేసాడు హాయ్ అంటే హాయ్ అని
పరిచయాలు చేసుకున్నారు 
రాహుల్ కుసుమలు తోడు దొంగలు లాగా ఏమీ
ఎరగనట్టు అప్పుడే పరిచయం అయినట్టు
తెగ నటించేశారు  కానీ ఒకరికి ఒకరు
చూసుకోవటం కొంటెగా కనులతో మాట్లాడటం
అంతా పెళ్ళికూతురు గమనిస్తూనే వుంది
రాహుల్ దైర్యం చేసి కుసుమ గారూ మీరు
చాలా అందంగా వున్నారండీ కానీ మిమ్మల్ని
ఎక్కడో చూసినట్టు గుర్తు ఎక్కడో సరిగా
ఐడియా రావట్లేదు అన్నాడు రాహుల్
మనుషులను పోలిన మనుషులు వుంటారు
ఎవరిని చూసి ఎవరనుకున్నారో ఏమో
అని అన్నది కుసుమ
పరువం పరవళ్ళు తొక్కే వయసులో యువతీ
యువకులు హృదయాలు పరుగెత్తే మేఘాలే
అదే ప్రేమ అనే పులకింతలో హృదయ
సందేశాల సరళింపులో మనసు తీయని తేనెల
జలపాతంలో ఓలలాడుతుంటుంది ఎటు
చూసీ నా పండు వెన్నెల చల్లదనంలో ఆనందం
నందన వనంలో విహార భరితమే కలకు ఇలకూ
తేడా తెలీక కలలో ఇలలా ఇలలో కలలా
మెలుగుతూ నలుగుతూ ప్రతీ క్షణం ఎంతో
విలువైనదిగా అదే కాస్త ఎడబాటైనా
క్షణమొక యుగమై విరహాల ముళ్ళు తోటలో
విరిసిన గులాబీలు రాహుల్ కుసుమలు
ఇలా పరిచయాలు వేదికను తిలకించే వేగుల వనితామణులు చెవులు చేటలై కళ్ళు పత్తి
గింజలై ఒకచోట చేరి చూసావా వదినా
విడ్డూరం ఆ మూడుముళ్ళూ పడనేలేదు
ఒకటే ఇక ఇకలూ పక పకలూ అని
అంటే బదులుగా చూస్తున్నాను అంతా
కలికాలం ఎంత చదువుకుంటే మాత్రం
అవ్వా పెళ్ళి కాకుండా మాట్లాడోచ్చా విడ్డూరం
కాకపోతే అని అనగానే ఇంకొక అక్క అయినా
మనకెందుకులే కందకు లేని దురద కత్తిపీటకు
ఎందుకు అన్నట్టు మనకెందుకులే పెళ్ళికి వచ్చామా తిన్నామావెళ్ళామా అన్నట్టుగా వుండాలి అంటూ
ఒకరిని ఒకరు ఓదార్చుకుంటూ కుర్చీలో
కూలబడ్డాడు  ఆ మాటలను వింటుంటే కుసుమ ?
(సశేషం)తరువాత బాగం రేపే...!

కామెంట్‌లు