"నీజ్జాపకం నాతోనే" 1980(ధారావాహిక ,28,వ బాగం)-- "నాగమణి రావులపాటి "
 కుసుమ తల్లి తండ్రులు చనిపోయిన విషయం రాహుల్ కు చెప్పేసాడు ఫ్రెండ్......!!
అంతే నో అలా జరగటానికి వీల్లేదు పాపం కుసుమ
ఎంత బాధ అనుభవించిందో సమయానికి నేను
కూడా లేను గీత ఊరెళ్ళింది కదా ఓదార్చే వాళ్ళు
కరువై ఎంత గాబరా పడిందో వెంటనే వెళ్ళి
కుసుమను ఓదార్చాలి అసలే జాలి హృదయం 
మొహమాటం ఎక్కువాయె ఈ సమయంలో నేను 
తోడువుంటే తాను తొందరగా కోలుకుంటుందీ
ఇలా పరిపరి విధాల ఆలోచిస్తూ అసలు విషయం తెలియక బస్ ఎక్కేసాడు రాహువు......!!
నేరుగా గణేష్ దగ్గరకు వెళ్ళాడు రాహుల్
రాహుల్ ను చూడగానే ఒకింత భయం దుఃఖం
సంతోషం అన్నీ ముందుకొచ్చాయి గణేష్ కి
అన్నయ్య నన్ను క్షమించు అప్పుడు నేను
బిజినెస్ పనిమీద హైదరాబాద్ వెళ్ళిల్సి వచ్చింది వదిన మాటైనా చెప్నకుండా ఇలా చేస్తుందని
అనుకోలేదు నేను హైదరాబాద్ వెళ్ళినప్పుడు
వచ్చి వేళ్ళిందేమో అనుకున్నా నాలుగు రోజులుఈ
చూసి రాక పోయేసరికి నేనే వెళ్ళాను..........!!
అప్పటికే వాళ్ళు ఇల్లకాళీ చేసారని ఇంటి ఓనర్స్
చెప్పారు ఎక్కడికి వెళ్ళారూ కూడా తెలియదు ఏమి
చేయాలో నాకు తెలియక నీకు చెప్పమని నీ ఫ్రెండ్ కి
 చెప్పాను అని గణేష్ అనేసరికి రాహుల్ నిలువునా
కంపించి పోయాడు......‌....!!
ఏంటిరా నీవు అనేది కుసుమ ఇల్లు ఖాళీ చేయటం
ఏమిటి అని అన్నాడు రాహుల్ అంటే నీకు నీ ఫ్రెండ్
చెప్పలేదా వదినా వాళ్ళు రెండురోజుల క్రితమే
వాళ్ళు బంధువులు వచ్చి ఇల్లు కాళీ చేసారట 
ఎక్కడికివెళ్ళారు అని అడిగితే వైజాగ్ అని అన్నారట
వదిన నాకు ఒక్కమాట చెప్పినా ఆపేసే వాడిని
అలా చెప్పా పెట్టకుండా ఎందుకలా చేసిందో నాకు
అర్దం కాలేదు అని అన్నాడు గణేష్ .....!
అంతే రాహుల్ కు కోపం బాధ ముందుకొచ్చాయి
గణేష్ మీద విరుచుకు పడ్డాడు నీకు ఏమి చెప్పాను
నువ్వు ఏమి చేసావు నీవు హైదరాబాద్ నుండి
రాగానే కుసుమ ను ఎందుకు కలవలేదు ??
నాలుగు రోజులు ఊరుకున్నాను వెంటనే వెళితే
తను కలిసేదే కదా తీరికగా ఇప్పుడు వెళ్ళావా
నీమీద నమ్మకంతో చూసుకుంటావని అనుకున్నా
నీ అశ్రద్దవల్ల నాకుసుమ వివరాలు నాకు తెలియ
కుండా పౌయాయి నా కుసుమ నాకు కూడా
చెప్పా పెట్టకుండా ఎక్కడికి వెళ్ళింది .....!
అసలు అలా ఎందుకు చేసింది చూస్తుంటే కావాలని
నాకు తెలియకూడదని అనుకుందా ?(సశేషం)

కామెంట్‌లు