"నా జ్జాపకం నాతోనే"1980(ధారావాహిక 38,వ బాగం)--, "నాగమణి రావులపాటి "
కాలం నడకలో సాగే మనిషి పయనం చీకటి నిండిన జీవితంలో వస్తుందో రాదో తెలియని  వెలుగు కోసం
ఆరాట పడుతూ చీకటి వెలుగుల రంగుల కలలను
కంటూ ఆశా నిరాశల మద్య ఊగిసలాడుతూ ప్రేమ
గాయం మనసును వీడక బాధ పెడుతూ వుంటే
కుసుమ జ్జాపకాల నెమరి వేతలో కాలం వెళ్ళదీసే
రాహుల్ కు బ్యాంకు జాబ్ మచిలీపట్నం బదిలీపై
కొత్తగా వచ్చి రూమ్ తీసుకుని వుంటున్నాడు  
పొద్దున బ్యాంకు లో కుసుమ పేరు చెవిని పడగానే
మనసు మనసులో లేదు రాహుల్ కు ఆమే నాకుసుమ అయితే ఎంత బాగుండును అని ఒకటే
ఆరాటం రేపు బ్యాంకు కు వెళ్ళగానే తన సహోద్యోగి
సురేష్ ని వివరాలు తెలుసుకుని వెళ్ళి రావాలి
ఏదో ఒక వంకతో అని గట్టి నిర్ణయానికి వచ్చాడు రాహుల్ తనే అయితే  నన్ను చూసి ఏమను
కుంటుందో ఒక వేళ నా గడ్డం నావాలకం చూసి నన్ను
గుర్తు పట్టలేదేమో ఏది ఏమయినా రేపు చూసి
రావాల్సిందే అనుకుంటూ పరిపరి విధాలా కుసుమ
ఆలోచనలతో ఆరాత్రి గడిపాడు రాహుల్.....!!
ఎవరిని ఎప్పుడు కలుపుతాడో ఎప్పుడు విడదీస్తాడో
ఆదేవునికే ఎరుక కష్టపడే మనసుండాలే కానీ 
అనితర సాద్యం అంటూ ఏదీ లేదు కుసుమ చాలా
సమయస్పూర్తి కలది అన్ని పనులు ఎంతో నేర్పుతో ఓర్పుతో చేస్తూ చెల్లెలికీ తమ్ముడికీ మార్గదర్శకురాలై
ప్రేమానురాగాల నిలయం తమ సదనంగా మార్చింది
అక్క అడుగు జాడలలో నడుస్తూ చదువు పనిపై
శ్రద్ద కలిగి అక్క ప్రేమకు పాత్రులైన వాళ్ళిద్దరూ
రెండు కళ్ళు కుసుమ కు చెల్లి కాలేజ్ కు ఆటోలో
సేఫ్ కాదని స్కూటీ తీసుకుని  నేర్చుకుని లైసెన్స్
పొందింది చెల్లిని దింపటం బయట పనులు ఏమైనా
సరే తానే స్వయంగా చేస్తుంది సాయంత్రం దాకా
తనే షాపు చూసుకుంటుంది టైలరింగ్ కోసం
ఇద్దరిని పెట్టుకుంది వర్క్ చేయటానికి ఆరు గంటల
నుండి తమ్ముడు చెల్లెలూ చూసుకుంటే తాను
ఇంటికెళుతుంది వాళ్ళకు ఏలోటూ రాకుండా అన్నీ
చూసుకుంటుంది దటీజ్ కుసుమ.....!!
ఇంకా రాహుల్ జిరాక్స్ షాపు వివరాలు సురేష్
వద్దు సేకరించి బ్యాంక్ టైంఅయిపోగానే ఏవో కొన్ని
పేపర్లు జిరాక్స్ చేయించే వంకతో షాపు లోనికి
ప్రవేశించాడు అప్పటికే కుసుమ ఇంటికి వెళ్ళింది
తమ్ముడు జిరాక్స్ పని చూసుకుంటున్నాడు
కుసుమ చెల్లి చీరకు ఫాల్ కుడుతోంది వర్కర్స్
పని చేసు కుంటున్నాను రాహుల్ అంతా కలియ
జూసాడు ఎక్కడా కుసుమ జాడ తెలియలేదు
కుసుమ గురించి అడుగుదామంటే ఏమనుకుంటారో
ఆ చీర కుట్టే అమ్మాయి పేరు కుసుమ నా ఏమిటి
అని అనుకుంటూ వుండగానే  పూర్ణిమ అక్కా అక్కడ
వున్న  పేపర్స్ ఇవ్వు  అని కుసుమ తమ్ముడు
వైభవ్ అడిగే సరికి ఓహో తన పేరు కుసుమ కాదు
అన్నమాట? (సశేషం) 

కామెంట్‌లు