"నీ జ్జాపకం నాతోనే"1980(ధారావాహిక 40,వ,బాగం) "నాగమణి రావులపాటి "
 జీవితం ఒడిదుడుకుల నావ సాగర ప్రవాహాన్ని బట్టి
మనిషి జీవితం ఆధారపడి వుంటుంది‌......
ఒకోసారి అలల తాకిడికి అతలా కుతలం చేసి మనిషి
జీవితంతో ఆటలాడుకుని సముద్రంలో ముంచితే
ఒకసారి ఏమీ ఎరుగని దానిలా నిర్మలంగా వుంటూ
ఆశ నిపాశంలో ముంచి తేలుస్తుంది.......
ఏది ఏమైనా అన్నింటినీ ఎదుర్కుని జీవనపోరాటం 
లో ఎదురీతక తప్పదు......
కుసుమ దీక్ష పట్టుదల చూపరులను ఇట్టే ఆకట్టుకుని
అచ్చెరువుకు గురి చేసేది.... కుసుమ బాబాయి
అయితే తాను నాఅన్న కూతురు చాలా తెలివి
కలది అని అందరికీ గర్వంగా చెప్పుకుని
మురిసిపోతుండేవాడు.........
కుసుమ తన కాఫీ పొడి బిజినెస్ రోజు రోజుకూ
దినదినాభి వృద్ది చెందుతూ ఎంతో లాఘవంగా
ఓర్పుతో నేర్పుతో సమయం వృధా పోనీయక
ఒక క్రమ పద్దతిలో నడుచుకుంటూ ఎప్పుడూ
బిజీ బిజీగా వుంటోంది ........
జిరాక్స్  తమ్ముడు కి టైలరింగ్ చెల్లెలికీ
తను కాఫీ అమ్మకానికీ ఇలా ఎవరి బాధ్యతలు
వారు నిర్వర్తించే పనుల్లో వాళ్ళు చదువులకు
విఘాతం కలగనీయక ఒకరికి ఒకరు సహాయ
సహకారాలతో మూడు పువ్వులూ ఆరు కాయలు
అన్నట్టు తీర్చి  దిద్దు కుంటున్నారు‌........
అక్కలో అమ్మానాన్నలను చూసుకుంటూ ఆమె
అడుగు జాడలో హాయిగా జీవనాన్ని కొనసాగిస్తూ
ఆదర్శ కుటుంబంగా తీర్చి దిద్దుతోంది కుసుమ....
రాహుల్ కు ఎక్కడో చిన్న ఆశ కుసుమ తనేనేమో
అని అంతలోనే కాదు కాదు కుసుమకు ఇవేవీ
తెలియదు అంత షాప్ ను నిర్వర్తించాలంటే
తనవల్ల కాదు అయినా కుసుమ ఎక్కడికి 
వెళ్ళినట్టు.... పెద్దలు తోడు లేకుండా తోడబుట్టిన
వారిని తీసుకుని ఎన్ని పాట్లు పుడుతుందో ఏమో...
తీవ్రమైన మనో వేదనతో రగిలి పోయే రాహుల్
ఒక నిర్ణయానికి వచ్చాడు ఆనుకున్నదే తడవుగా
రేపటి కోసం సెలవు తీసుకున్నాడు......
తెల్లవారి తయారై కుసుమ షాపుపై బీట్ 
వేసాడు....అల్లంత దూరంలో నిలబడి కనుల రెప్ప
కూడా వేయటం మరిచి తీక్షణ వీక్షణాలతో అటే
చూస్తూ ఈ కుసుమ ఏ కుసుమో అనే ఆత్రంతో
నిలుచుండి పోయాడు,,,(సశేషం)

కామెంట్‌లు