అమ్మ తనంలో కమ్మదనం ;- జటావత్ మునినాయక్ -జాల్ తండా (నల్గొండ)-చరవాణి ;;- 7659888655

నవమాసాలు గర్భగుడిలో మోసి 
పురిటి నొప్పులు సైతం భరిస్తూ నాకు జన్మనిచ్చిన తల్లి 
చందమామను చూపుతూ గోరుముద్దలు తినిపిస్తూ 
కమ్మని లాలీ పాటలు పాడుతూ నిద్ర బుచ్చినా కమ్మని పలుకే అమ్మ 
నా చిన్న నాడు అమ్మ చూపిన ప్రేమే ఇప్పుడు మనం పంచె ప్రేమ 
అమ్మ ప్రేమ కమ్మనైనది 
అమ్మ ప్రేమ అమృతం 
అమ్మ ప్రేమను ఎన్ని వేల కోట్లు పెట్టిన కొనలేము 
నడిపించే దీపం అమ్మ 
కరుణించే కోపం అమ్మ 
అమ్మను మించి దైవమున్నదా 
జగమే పలికే శాశ్విత సత్యమిడే 
కణకణలాడే ఎండకు శిరసు మాడిన 
మనకు తల నీడను అందించే చెట్టే అమ్మ
మరపురాని మధుర జ్ఞాపకం అమ్మ.
కామెంట్‌లు