*శ్రీ శివపురాణ మాహాత్మ్యము* *రుద్ర సంహిత - ప్రథమ (సృష్టి) ఖండము - (౮౧ - 81)*
 *మహాప్రళయకాలమందు కేవలము సద్బ్రహ్మయొక్క శక్తిని ప్రతపాదించుట - నిర్గుణ నిరాకార బ్రహ్మచేత యీశ్వరమూర్తి ప్రాకట్యము - సదాశివుని ద్వారా స్వరూపభూతశక్తి ప్రాకట్యము - వీరి ద్వారా ఉత్తమక్షేత్రమైన కాశీ లేక ఆనందవనము ప్రాదుర్భావము - శివుని వామాంగము నుండి విష్ణువు ఆవిర్భావము - వర్ణన*
*శివ మహాదేవుడు ప్రకటిమయ్యాక, జగన్మాత ప్రకటితమవడం ఇప్పుడు తెలుసుకుందాము.*
*ప్రకటితమైన సదాశివుడు ఎంత కాలం ఒంటరిగా వుంటాడు. అందుకని, ఆ స్వామి తన నుండి ఒక సర్వభూత శక్తిని ఉద్భవింప చేశాడు. స్వామి నుండి వచ్చిన శ్రీ శక్తి ఆ స్వామి నుండి ఎప్పుడూ వేరుగా లేదు. శక్తి స్వామి లో అంతర్భాగమే. ఆ పరాశక్తిని, ప్రధానము, పకృతి, గుణవతి, మాయ, బుద్ధతత్వ, జనని, వికార రహిత అన్నీ తానే అయి వుంటుంది. ఆ శక్తియే, అంబిక, సర్వేశ్వరి, త్రిమూర్తులకు తల్లి, నిత్య, మూలకారణము కూడా తానే. సదాశివుని నుండి వెలువడిన ఈ శక్తికి ఎనిమిది భుజములు వున్నాయి. శుభలక్షణ. సర్వజనని అయిన ఆ తల్లి ముఖము ఎంతో శుభప్రదంగా వుంటుంది. వేల చంద్రకాతులను తనదిగా చేసుకుంటుంది ఈ తల్లి. అన్ని రకాల ఆయుధాలు తనవే. తానే ఆయుధము.*
*సదాశివుడు, పరమపురుషుడు, ఈశ్వరుడు, శివుడు, శంభుడు, మహేశ్వరుడు కూడా అతడే. తన జటాజూటంలో గంగను నిలొపి వుంటాడు. నుదిడి మీడ చలువ వెన్నెలలు కురిపించే చంద్రుని ధరిస్తాడు. ఈ సదాశివుడు పంచముఖుడు. ఒక్కొక్క ముఖంలో మూడు మూడు కన్నులు వుంటాయి. ఈ సదాశివుడు పది భుజములతో త్రశూల ధారియై వుంటాడు. చేతిలో ఢమరుకముతో, పులి చర్మాన్ని చుట్టుకుని, భస్మాన్ని ఎల్లప్పుడూ ధరిస్తాడు.*
*సదాశివుడు అంబతో కలిశాడు. మరి ఇల్లు కావాలి గదా! అప్పుడు కాలరూపములో వున్న బ్రహ్మ "శివ లోకమును" సృష్టి చేస్తాడు. ఇదే పరమ ఉత్కృష్టమైన "కాశీ క్షేత్రము అన బడే ఆనంద నిలయము".*
*ఇతి శివమ్*
*శివో రక్షతు! శివో రక్షతు!! శివో రక్షతు!!!*
.... ఓం నమో వేంకటేశాయ
Nagarajakumar.mvss

కామెంట్‌లు