రామానుజుల జయంతి
శుభాకాంక్షలు అందిస్తూ,
=========================
1.ఛాందసాలుగా మారే,
ఆచార వ్యవహారాలు!
సమాజ పురోగమన,
పథాన అవరోధాలు!
వాటిని ఆచార్యుడు,
సత్వరం గుర్తించాలి!
మానిపించాలి, మార్చడానికి,
ఉద్యమించాలి!
అదే ఆచార్య ప్రథమ,
ప్రధాన కర్తవ్యమనిపించాలి.
2.దేవుడ్ని పూజించడం,
మోక్షం సాధించడం!
మనిషిగా జన్మించిన,
ప్రతివాడి జన్మహక్కు!
ఆ హక్కు లాక్కునే,
అధికారం దైవధిక్కారం!
దేవుని సృ(దృ)స్టిలో,
అందరూ సమానులే!
మనుషులు,సామరస్యం,
పంచుకుంటే వివేకం !
వైషమ్యాలు పెంచుకుంటే,
మారని మూర్ఖత్వం!
3.గురువులు చెప్పినదంతా,
గుడ్డిగా నమ్మకు!
చెప్పిన దానికి,
నీ తర్కం జోడించు!
అది తప్పో ఒప్పో నిర్ణయించు,
అది పాపమేమి కాదు!
ఈ విషయంలో ఏమాత్రం,
అధైర్యపడవద్దు!
5.మనిషి చేసే ఒకపనివల్ల,
పదిమందికి మేలు కలగాలి!
అతడికి ఆ పనివలన,
కీడు జరిగినా నష్టం లేదు!
వ్యక్తిగత సుఖం కన్న,
సామాజిక శ్రేయస్సే మిన్న!
సమాజ పురోగతికి,
ఈ భావనే బలమన్నా!
5.శ్రీరంగంల్లోనో, కాకుంటే,
హైదరాబాద్ శివార్లలోనో!
రామానుజ దివ్యదర్శనం,
చేసుకుంటే చాలదు!
ఆయన బోధనలు,
త్రికరణశుద్ధిగా ఆచరించాలి!
ఆయన ఆశయాలు,
సంపూర్ణంగా నెరవేర్చాలి!
ఆయన కాంక్షించిన,
సమసమాజం నిర్మించాలి!
_________
జ్ఞానస్ఫూర్తి-- సమతామూర్తి;-డా.పి.వి.ఎల్.సుబ్బారావు.9441058797.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి