ఆత్మ కోరేది సజ్జన సాంగత్యం: : విత్తనాల విజయకుమా కుమార్-హైదరాబాద్.
నోరులేని జీవాల ఉసురు నిలిపే ఆశయం వెటర్నరీ డాక్టర్ ప్రియాంక రెడ్డిది.
నోరున్న నలుగురు పశువుల కామ దాహానికి బలైపోయింది.
వేళ కాని వేళ తన ద్విచక్ర వాహనం మొండికేసింది. 
మరమ్మత్తు కోసం చూస్తున్న అబల కామాంధుల కళ్ళలో పడింది.

నలుగురికీ సహాయ పడే వారిలా నటించారా నలుగురు కీచకులు.
పొదల్లోకి లాక్కెళ్ళి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారా కిరాతకులు.
అత్యంత దారుణమైన సంఘటనలో  పెనుగులాడి ఉసురును వదిలింది.
దిశగా మారిన ప్రియాంక ఆత్మ దేహాన్ని విడిచి మూగబోయింది.

దేహాన్ని వదిలిన ఆత్మ అశాంతితో రగిలిపోయింది. 
ఓ సజ్జనుడైన అధికారిని ఆవహించింది. 
రాష్ట్ర ప్రజల ఆరాటాన్ని గుర్తించాడా అధికారి. 
కీచకులను చాకచక్యంగా ఎన్కౌంటర్లో అంతమొందించాడు.

ప్రజలూ ప్రభుత్వం హర్షధ్వనాలతో కీర్తించిందా సజ్జనుడిని.
మానవ హక్కుల సంఘం చట్టబద్ధతలేని ఎన్కౌంటర్కు కేసు పెట్టింది.
స్వరం లేని దిశ ఆత్మ విచారణాధికారినీ ఆవహించింది. 
సజ్జనులను కాపాడే తీరుతుంది ఏ ఆత్మైనా.

మరణంతో ఆత్మ, స్వరమున్న దేహంలేక మౌనాత్మగా మారినా,
తన దేహానికి జరిగిన దారుణాలకు అశాంతితో రగిలిపోతుంది.
ఆత్మను శాంతించమని కోరే వారి మొర విని సజ్జన సాంగత్యాన్ని ఆవహిస్తుంది. 
దుర్మార్గుల దుమ్ము దులిపి లోకానికి మేలు చేసి శాంతిస్తుంది.

•••••••••••••~•


కామెంట్‌లు