జీవితంలో కాశీ యాత్ర ఒక్కసారైనా చేయాలని హిందువుల నమ్మకం. ఒక్కసారి గంగమ్మ నీరు తల మీద జల్లుకుంటే పాపాలన్నీ పోతాయి అని పెద్దలు చెబుతారు గంగానది ప్రవహిస్తూ ఉంటే దాని వేగం ఏమీ కనపడదు ప్రశాంతంగా నిలకడగా సాగుతోంది. నిజానికి గంగా నది పద్ధతి చూడాలంటే లక్ష్మణ ఝలాకు వెళ్ళాలి. అక్కడ వాతావరణం ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. సీతమ్మ వారి కోసం నిర్మించిన వంతెన అది. దాని మీద నడుస్తూ ఉంటే గొప్ప అనుభూతి కలుగుతుంది. దానికి క్రింద చిన్న చెరువు, చిన్న పడవలో కూర్చుంటే ఆ చేపలు మనతో ఆడుకుంటాయి. అక్కడ వ్యాపారులు మరమరాలు వేయించిన శనగపప్పు అమ్ముతూ ఉంటారు అవి వాటి ఆహారం అక్కడ నుంచివచ్చి గంగానదిలో స్నానం చేద్దామని నదిలో దిగితే మన చిరునామా దొరకదు అందుకే నిర్వాహకులు ప్రతి అడుగుకు పట్టుకోడానికి ఇనప స్తంభాలు పెట్టారు. ఈ ఒడ్డు నుంచి అవతల ఒడ్డుకు వెళితే చాలా ప్రశాంతంగా చెరువులో స్నానం చేసినట్లు ఉంటుంది. ఆ రెండుకి అంత భేదం ఉంది. చలం గారు చెప్పినట్టు విజయవాడలో మురికి కాల్వల కంపు భరించలేము అంటాడు. తెలుగు సాహిత్యానికి అన్వయించి వ్రాశారు మహాప్రస్థానం ముందుమాటలో. వేమన గారు చక్కని ఆటవెలదిలో "గంగ పారు చుండు కదలని గతి తోడ మురికి కాలువ పారు మ్రోతతోడ" అని చక్కగా రాసి "దాత ఓర్విన్నట్లు అధముడు ఓర్వగలేడు" కదా అని ముగిస్తాడు. నిజానికి దాతకు, అధముడికి ఎంత తేడా ఉంది హస్తిమశకాంతరం దానిని ఎంత అలతి అలతి పదాలతో మనకు అందించారు వేమన మహాశయుడు!
ఉత్తమ స్థితి;-ఏ.బి ఆనంద్ఆకాశవాణి.94928 11322
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి