మన'సుకవి' కి శతకోటి వందనములు.--అయ్యలసోమయాజుల ప్రసాద్ విశాఖపట్నం--చరవాణి:-9963265762
కృష్ణమాచార్యులు ,సీతమ్మల వరప్రసాదివై. సూళ్ళురూపేట ,మంగళంపాడునందు జన్మించి
బాల్యంలోనే పద్యరచన చేసి, తదుపరి గేయరచన చేసి అందరి మనస్సులను
రంజింప చేసిన 
మన'సుకవి' మీకు శతకోటి వందనములు.........!!

తేట తేట తెలుగులా తెల్లవారి వెలుగులా అన్నా
ముద్దబంతి పువ్వులో మూగకళ్ళఊసులో అన్నా
శిలలపై శిల్పాలు చెక్కినారు మనవాళ్ళు సృష్టికే అందాలు తెచ్చినారు అని వ్రాసినా
కళ్ళలో ఉన్నదేదో కన్నులకే తెలుసు అని ఎన్నో ఎన్నెన్నో  సినీగీతాలు రచించి ప్రేక్షకుల  మనస్సులను దోచుకున్న  సినీగేయ ప్రపంచానికే రారాజువై పురస్కారాలకే వన్నె తెచ్చిన 
మన"సుకవి"  మీకివే శతకోటి వందనములు....!!

మాతృమూర్తి పరదేవతా స్వరూపమే అని ఆత్మకథను నాలో నిజం కోసమే  వ్రాస్తున్నాని అసంపూర్ణంగా వదలి శ్రీరామునికడకేగినా
"ఈ ఫున్నెము నా తల్లిది
నా ప్ర

తిభ కాదు " అని అంకితమివ్వదలచి  ఆమె మీద పదిహేడు పద్యాలు వ్రాసి, మా అమ్మ సీతమ్మ చల్లని తల్లి అన్న 
మన "సుకవి" మీ కివే శతకోటి వందనములు...!!

సామజిక స్పృహ కలిగిన కవిగా, సమాజంలోని అసమానతను ,తారతమ్యాలను 
"సాపాటు ఎటూలేదు పాటైన పాడు బ్రదర్
స్వతంత్ర దేశంలో చావుకూడా పెళ్ళి లాంటిదే బ్రదర్" అని ఆకలిరాజ్యంలో సినిమా గీత రచనా ద్వారా తెలియచేసిన ఆచార్య ఆత్రేయ మీరు  భగవంతుడు మాకిచ్చిన    " సుకవి" వే అందుకోండి మా శతకోటి వందనములు......!!
..............................

కామెంట్‌లు