బంగారు లేడి;-ఏ.బి ఆనంద్,ఆకాశవాణి.
 రామాయణంలో వాల్మీకి మహర్షి గానీ, రాముడు గానీ ఎక్కడా తాను దేవుడు అని చెప్పుకోలేదు. గాయత్రీ మంత్రం లో ఉన్న  24 అక్షరాలలో  24 జీవిత ధర్మాలను తూ.చా. తప్పకుండా చేశారు కనుక  ఆయనను మనం దేవుని గా పూజిస్తున్నాం  అంటారు  ప్రముఖ వేదాంతి శ్రీభాష్యం అప్పలాచార్యులు గారు.  కైక  అరణ్యవాసానికి రాముని వెళ్ళమన్నది తప్ప సీత కాదు పతివ్రతా ధర్మం కోసం తన తల్లి మాట చెల్లించడం కోసం భర్తను అనుసరించింది సీత. అలాంటి సీత కోరిక ఏదైనా  తీర్చి తీరవలసినదే అని రాముని సంకల్ప అయి ఉండవచ్చు.  లేడిని చూడగానే  శృంగారభరితమైన జంతువు కనుక కన్నార్పకుండా దాని కొమ్ములనే చూస్తూ ఉంటాము.  సీతమ్మ వారు కూడా  సహజంగా దాని అందాన్ని ఆస్వాదించడం కోసం  అనుకుని ఉండవచ్చు.  అందుకే భర్తను దానిని తీసుకు రమ్మని కోరింది. ఎప్పుడు ఏమీ అడగని భార్య  కనుక తను కోరిన కోరిక ప్రకారం  దానిని వెతకడానికి బయలుదేరాడు శ్రీరామచంద్రమూర్తి ఆ సంఘటన లేకపోతే  రామాయణమే లేదు. వేమన హేతువాది కనుక భగవంతుడు అన్న వాడు బంగారపు లేడీ ఉండదన్న విషయాన్ని కూడా గమనించలేడా అని ఎద్దేవా చేశారు. కార్యకారణ సంబంధం హేతువాదం  దాని ఆధారంగానే వేమన మాట్లాడాడు తప్ప. వాల్మీకి రాసిన  ధర్మ ప్రచారాన్ని అడ్డుకోవడానికి మాత్రం కాదు.


కామెంట్‌లు