1.చంపకమాల
పశుపతి పార్వతీశ తమ; పావన పద్మ పదారవిందముల్
నిషధము లోన కూడ మిము; నెమ్మన మందున మర్వజాలరా!
శశిధర శూలహస్తహర; సల్పెద నీ పదసేవ లెప్పుడున్
దశవిధ బ్రహ్మణాథుడవు; దానవ సంహర రుద్రరూపుడా! .
2. చంపకమాల;
ప్రమథ గణాది సేవితుడవాసుకి భూషణ లోక రక్షకా!
శమమయ శాంత రూపుడవు; సద్గతినిచ్చెడి దేవ దేవుడా!
కమల సునేత్ర వీక్షుడవు; కానవదేలర దీనబాంధవా!
విమల మనోభిరాశివిల; విశ్వమునంతటి నేలుచుంటివే .
3. ఉత్పలమాల
బండ్లను గట్టివచ్చియు; బాగుగ దండలువేసి ముద్దుగన్
గుండ్లను చుట్టుతిప్పుదురు; కొబ్బరికాయలు కొట్టి వేడుచున్
పెండిలి యైనవారు దరి; పేర్మిగ జేరియు మ్రొక్కు దీర్చియున్
నిండ్లకు జేరుకొందు రయ; యిష్టము మీరగ స్వామి బొట్టుతో! .
4. ఉత్పలమాల
ఫాలసునేత్ర శంకరుడ;పార్వతి వల్లభ మమ్ము గావరా!
యేలను గాంచవేల శివ; యెన్నియొ పూజలు జేసివేడగన్
కాల విభూషణుండ హర; కన్నుల గాంచెడి భాగ్యమెన్నడో!
లీల వినోద శంకరుడ; లీలలు తెల్యగ నెంత వారమే! .
5. ఉత్పలమాల
మర్దన జేయ సాగరము; మంటలు గ్రక్కె విషమ్ము కొంత యున్
సర్దియు మ్రింగి నావు యెడ; చక్కగ కంఠమునందు నిల్పియున్
దుర్థయు నెంతనైన హర;దోసిలి నొగ్గియు త్రాగి నావుగా!
నిర్దయ జూపకుండగను; నీవిల రక్ష జేసినావుగా! .
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి