ప్రకృతి కన్య ..!!...... శ్రీమతి లక్ష్మీ పద్మజ.దుగ్గరాజుహైదరాబాద్.

ప్రకృతి కన్య 
పచ్చటి పావడాతో 
ఎర్రపూల జాకెట్టుతో 
తెలతెల్లని ఓణీతో 
ఎంత అందంగా ఉండేదో !

కానీ..... 
నేటి సమాజం లో 
ఆకాశ హర్మ్యాల నిర్మాణంలో 
కుక్కలు చింపిన విస్తరిలా 
తునాతునకలై,  కళా విహీనమై 
ఈ కాంక్రీట్ జంగిల్ లో 
నిర్వీర్యమై నిస్సహాయంగా 
నిలబడిపోయింది !

తనలోని ఆక్సిజెన్ ని 
ప్రజలకు ప్రసాదం లా పంచి 
తన మనుగడకే ముప్పు 
తెచ్చిన మనిషికోసం 
ప్రకృతి కన్య కన్నీళ్లు కారుస్తోంది !

రేపటితరం కోసం యోచించని 
చిన్న మనసున్న మనిషి కోసం 
చింతిస్తోంది !

ఆస్తులు అంతస్తులు మనవారికి 
ఎన్ని ఇచ్చినా,,  ఆక్సీజన్ లేని 
ధరిత్రిపై మనిషి ప్రాణానికి 
రక్షణ లేదని శోకిస్తోంది !

ఓ మనిషీ.. 
తిరిగి చూడు 
నీకోసం,  నీవారికోసం 
నను నిలబెట్టుకో అని 
గొంతెత్తి అరుస్తోంది ! 

ఇప్పటికైనా 
మించి పోలేదు సమయం.. 
నేటి మొక్కనే రేపటి వృక్షమై 
నీవారిని అక్కున చేర్చుకుంటాను 
ఆమ్లజనిని అందిస్తాను..  
అని పిలుపునిస్తోంది !!
                ***



లక్ష్మీ పద్మజ దుగ్గరాజు 
హైదరాబాద్.
కామెంట్‌లు