బడి బందుకావాలి (బాలగేయం);-- డా.గౌరవరాజు సతీష్ కుమార్.

 భాషా ఘోషాల మాటున
శాస్త్రాల శస్త్రాలను
గణిత అగణితాస్త్రాలను 
సంధించే బడి
బందు కావాలి! 
మెదడును కట్టేసే
పుట్టెడు పుస్తకాలను మోయిస్తూ
బాలకార్మికులుగా చేసే బడి
బందుకావాలి! 
క్రమ "శిక్ష " ణల పేరుమీద
బాలల బాల్యాన్ని 
ఉరితీసే బడి బందుకావాలి! 
పంతుళ్ళే 
పదితలల పాములై 
కాటేసే బడి
బందుకావాలి!
బడితె పూజలు 
చెంపదెబ్బలు
తొడపాశాలూ
అవమానాలు 
పిల్లలకిచ్చే బడి 
బందు కావాలి!

కామెంట్‌లు