మిమిక్రి ..!!;-డా.కె.ఎల్వీ.*
మనుష్యుల్లాగానే 
ఋతువులూ....
మోసంచేస్తాయ్!

హామీలు ఇచ్చి
పాలకుల్లా,
మేఘాలూ....
మడమతిప్పుతాయ్!

గ్రీష్మ ఋతువు -
వర్ష ఋతవులా
అప్పుడప్పుడూ
మిమిక్రీ--
చేస్తుంటుంది,
చేతికొచ్చినపంట
చేజారిపోతుంది !


'మోసం 'అనేమాట 
ఇప్పుడు....
మామూలుఅయిపోయింది !
నిత్య దినచర్యలో 
ఇది భాగమైపోయింది.!!

                 ***


కామెంట్‌లు