ఆవేశము -అనర్ధముపద్యం:(ఆట వెలది );-ఎం. వి. ఉమాదేవి
మనసులోన బుట్టు మనిషికా వేశము 
కలతజెందు రీతి కలవరమ్ము 
శాంతితోడ మెలగ సర్వమానందము 
మంచిచెడుల చింత మహితమగును !

(తేటగీతి )
చీకు చింతయు లేనట్టి చిన్నవాడ
కస్సు బుస్సులనాడఁగన్ కలిమిబోవు 
లక్ష్మి నిలువదు నారోగ్య లతయు వాడు 
కార్య మంతయు జెడినట్టి కష్టమందు 
నణచు నావేశకావేశ మనర్ధమ్ము 
శాంతిగల్గును బ్రతుకున సమరసమున !!

కామెంట్‌లు