* సార్ధకత *--కోరాడ నరసింహా రావు !
 " నిన్న " లోనే ఉండిపోయిన 
     వారికి...* రేపు * ఉండడు!
రేపటికి... నేడే... వారధి !
      నేటిని పటిష్టంగా నిర్మించు కోగలిగిన వారే, రేపును... 
సునాయాసంగాజయించగలరు
   గతం ఊబిలో కూరుకుపోతే..
ఎంతో ప్రయత్నించి బయటపడ గలిగినా... పదింతల వేగంతో పరుగు తీయాల్సిందే... !
        ఐనా కాలాన్ని అందుకుని      సమానంగా పరుగుతీయ్యటం..
....కష్టమే !
 
కాలంతో పాటుకాదు.,కాలానికి 
రెండడుగులుముందు నువ్వుం డగలగాలి!
  నువ్వు ఎవరివెనకో పరుగులు
తియ్యటం కాదు,నీ వెనక ఈప్ర 
పంచాన్ని పరుగులు పెట్టించాలి 
  ఎవరో నీకుఆదర్శంకాదు,పదు గురికీ నువ్వే ఆదర్శం కావాలి!
    అపుడే... చరిత్రలో నీదో పేజీ      
 తయారవుతుంది !
అది చిరస్థాయిగా నిలుస్తుంది !
నీ జన్మకు సార్ధకత చేకూరు తుంది !!
       *******

కామెంట్‌లు