గురుదక్షిణ! అచ్యుతుని రాజ్యశ్రీ

 పూర్వం అంటే దాదాపు వందేళ్ల క్రితం దాకా పిల్లలు గురుకులాల్లో చదివేవారు.గురువు దగ్గర ఉంటూ ఆయనచెప్పిన పనులు తు.చ.తప్పకుండా చేసేవారు. ఇప్పటికీ కంచి శృంగేరీ పీఠాలలో బాల్యం లోనే  పిల్లలు చేరి వేదాలతోపాటు సకలశాస్త్రాల్లో బాగా ఆరితేరాక అందులో ఒకరు ఆపీఠాధిపతిగా ఎన్నిక కాబడతారు.తమగురుపరంపరను కాపాడుతూ ధర్మప్రచారంచేస్తారు.అలా మధుర లో(నార్త్ ఇండియా)దండీస్వామి విరజానందజీ వద్ద ఓపిల్లాడు మూడేళ్ళు విద్యార్జన చేశాడు. గురుదక్షిణ గా ఆపిల్లాడు కొన్ని లవంగాలు తెచ్చి  ఆయన పాదాలవద్ద పెట్టి  దీనంగా అన్నాడు "గురూజీ!నాదగ్గర  ఇవితప్ప వేరే ఏమీలేవు.మీకు లవంగాలు చాలా ఇష్టం కదూ? అందుకే  అర్ధసేరు లవంగాలు కష్టపడి సంపాదించాను.గురుదక్షిణ గా నాచిన్ని కానుకను స్వీకరించండి"అని ప్రార్ధించాడూ.
 ఆయన వాటినిస్పృశిస్తూ ఇలా అన్నారు" నాయనా!లవంగాలు బజారులో దొరుకుతాయి. నాకు నీదగ్గరమాత్రమే ఉన్న  వేరేఎక్కడా దొరకని అపూర్వ గురుదక్షిణ కావాలి. "ఆకుర్రాడు వినయంగా అడిగాడు "గురూజీ! అదేమిటో సెలవీయండి." దండీస్వామి అడిగారు " నేను నీలో ఓజ్వాల తపన చూస్తున్నాను.ఆజ్ఞానజ్వాల ఏమిటో తెలుసా?సత్యాన్వేషణ  జ్వాల! అవైదిక మతాల గూర్చి  భారతీయ సంస్కృతి సాంప్రదాయాలగూర్చి ఉన్న  అపోహలు  దుష్ప్రచారం ని దగ్ధం చెయ్యి! వైదికధర్మాన్ని వెలుగులోకి తీసుకుని రా! భారత దేశ కీర్తి పతాకాన్ని రెపరెపలాడేలా చెయ్యి! మానవజాతి ని ఉద్ధరించు.ఇదే నీవు నాకు ఇవ్వాల్సిన గురుదక్షిణ!"ఆబాల బ్రహ్మచారి ఆయన పాదాలపై వాలి"మీరు చెప్పినట్లుగా  చేసి మీ ఋణం తీర్చుకుంటా గురూజీ!"అని దాన్ని  ఆచరణలో పెట్టి మాట చెల్లించి  భారతచరిత్రలో ఓకొత్త అధ్యాయంకి శ్రీకారం చుట్టాడు.ఆచిన్నారి ఎవరో తెలుసా?మహర్షి దయానంద సరస్వతి 🌷
కామెంట్‌లు