తోటకెళ్ళా
పచ్చనిచెట్లులేవు
పూలులేవు
పండ్లులేవు
నదికెళ్ళా
నీరులేదు
ఇసుకలేదు
నిర్మలత్వంలేదు
నింగివైపుచూశా
నీలిరంగులేదు
నల్లనిమబ్బులేదు
నెలరాజువెన్నెలలేదు
పల్లెకెళ్ళా
పాడిలేదు
పంటలులేవు
ప్రేమలులేవు
భోజనంచేశా
రుచిలేదు
శుచిలేదు
కడుపునిండలేదు
పడతులచూశా
మమతలులేవు
ముసుగులులేవు
మొహమాటాలులేవు
వస్త్రాలుచూశా
చీరెలులేవు
రవికలులేవు
సింగారాలులేవు
మోములుచూశా
బొట్టులులేవు
నవ్వులులేవు
వెలుగులులేవు
కళ్ళనుచూశా
కాంతులులేవు
కాటుకలులేవు
కారుణ్యాలులేవు
తలలుచూశా
వాలుజడలులేవు
పూలకొప్పులులేవు
తైలసంస్కారాలులేవు
చేతులుచూశా
గాజులులేవు
ఉంగరాలులేవు
గడియారాలులేవు
కాళ్ళనుచూశా
గజ్జెలులేవు
నడకలులేవు
నాట్యాలులేవు
పుస్తకంచూశా
పాండిత్యంలేదు
ప్రావీణ్యతలేదు
పసందులేదు
కవితలుచదివా
ప్రాసలులేవు
మాధుర్యాలులేవు
పదగుంభనాలులేవు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి