సునంద భాషితం;-వురిమళ్ల సునంద, ఖమ్మం
 అక్షయ తృతీయ, రంజాన్ శుభాకాంక్షలతో 
==============================
చాటుగా... సూటిగా...
******
చాటుగా.. సూటిగా...
ఇవి రెండూ నిత్య జీవితాన్ని, ప్రవర్తనను ప్రభావితం చేస్తుంటాయి.
కొందరు మనుషుల నైజం చాలా విచిత్రమైనది. చాటుగా చెప్పే కబుర్లను ఆనందంగా ఆసక్తిగా చెవులొగ్గి మరీ వింటుంటారు. అలాగే ఇతరుల గురించి తెలిసీ తెలియని విషయాలకు చిలవలు పలవలు సృష్టించి చెబుతూ ఉంటారు..
అలా అవాకులు చవాకులు చెప్పేవారి చుట్టూ  ఓ పెద్ద గుంపే తయారవుతుంది.
ఇక సూటిగా, నిర్మొహమాటంగా మాట్లాడే వారు కొందరు ఉంటారు..వారికి చాటు, మాటుగా మాట్లాడటం అసలు ఇష్టం ఉండదు. ఏ విషయాన్నైనా  కుండబద్దలు కొట్టినట్లు మాట్లాడుతూ ఉంటారు.
ఏదైనా,దేని గురించి అయినా పూర్వాపరాలు తెలుసుకోకుండా  మాట్లాడరు. అలా ఎవరైనా మాట్లాడితే వెంటనే ఖండిస్తారు.అందుకే అలాంటి వారంటే చాలా మంది ఇష్టపడరు.
 చాటుగా చెప్పే వారితో చాలా ప్రమాదం. వారి వల్ల  కుటుంబాలు, వ్యక్తుల మధ్య మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉంటుంది.
 ఇక సూటిగా చెప్పే వారితో కొంచెం ఇబ్బంది ఉంటుంది. కొంతైనా సమయం, సందర్భం లౌక్యం లేకపోవడం వల్ల వారి మాటలు ఎదుటి వారికి బాధను కలిగిస్తాయి.
ఏది ఏమైనా చాటుతనం కంటే సూటితనమే మంచిది కదా..
ప్రభాత కిరణాల నమస్సులతో 🙏


కామెంట్‌లు