మహ్మదాలి జిన్నా ఓసారి లార్డ్ మౌంట్ బేటన్ దంపతులతో ఒక మీటింగ్ కి హాజరైనాడు.మనసు లో ఇలా ఊహించుకుంటూ వెళ్లాడు "నాకు మౌంట్ బేటన్ మధ్య ఆమె కూచుంటే ఫోటో తీయమని చెప్తాను. ' ఎరోజ్ బిట్వీన్ థార్న్స్" అని చమత్కరిస్తాను." కానీ అతని ఊహకాస్తా తలక్రిందులైంది.జిన్నా మధ్యలో కూచుంటే భార్య భర్త అతని చెరోవైపు కూచున్నారు.కెమెరాలు క్లిక్ మన్నాయి.ఆనందంగా ఠక్కున జిన్నా నోరుజారాడు"ఓహ్!రెండు ముళ్ళ మధ్య ముద్దు గులాబీ!" పాపం ఆ దంపతుల మొహాలు కోపంతో కందగడ్డలా మారాయి.వాడిముల్లులాగా ఆమె చూపులు గుచ్చుకోటంతో పాపం బిక్కమొహంతో అసలువిషయం తన ఊహ ఉల్టాపల్టా ఐన సంగతి బైట పెట్టి "క్షమించండి "అన్నాడు. వెంటనే ఆదంపతులు నవ్వేశారు. హమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నాడు జిన్నా!
1921లోఓవిందుకి జిన్నా భార్య రతన్ బాయి హాజరైంది.వైస్రాయ్ లార్డ్ రీడింగ్ ఆమె పక్కన కూచున్నాడు. "ప్రపంచయుద్ధం తో విసిగిపోయాను. జర్మనీ వెళ్లటం నాకు అస్సలు ఇష్టం లేదు. "రీడింగ్ మాటలు వింటూనే జిన్నా భార్య అడిగింది "ఎందుకు ఇష్టం లేదు?" "ఎందుకా?జర్మన్లకు మా ఆంగ్లేయులు అంటే ఒళ్లు మంట!మమ్మల్ని కొరకొరచూస్తారు."వెంటనే మిసెస్ జిన్నా ఠక్కున ఫెడీమని అడిగేసింది " ఒహో!అందుకేనా మీతెల్లదొరలు మాదేశానికి వచ్చారు? మేమేనా మీఆంగ్లేయులంటే ఇష్టపడేవారం?" పాపం వైస్రాయ్ మొహాన కత్తివాటుకి నెత్తురు చుక్క లేదు సుమండీ!🌷

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి