: గనిమ బిడ్డ ; -:*ఎం. వి. ఉమాదేవి
బక్కపలచని దేహం గనిమబిడ్డ 
చిక్కుపడిన మనసు రైతు బిడ్డ 
కనులనీరు తుడిచే ఆ తలగుడ్డ 
మట్టిపాదాలు మహిమగలబిడ్డ  

విత్తనాలు నానబెట్టే రోజుఅదే 
చెట్టుకింద తరవాణి తీరు ఇదే 
పుట్టెడు అప్పుకు భయం లేదే 
భూమిపై నమ్మకమే పోనేపోదే 

అరకొర మొలకలు ఆశలతీరం 
కలుపు తీవ్రమే కుటుంబభారం 
నీటికరువు వానలేవి సుదూరం 
పంటకి రేటులో దళారీ  ఘోరం 

కళ్లoలో రైతుల కలవరంచూడు 
పళ్లెంలో బువ్వకి కారణమతడు 
చేయూత నివ్వాలి తప్పక నేడు 
నేలతల్లికి ప్రధాన సేవకుడతడు  


కామెంట్‌లు