ఎర్ర ఎఱ్ఱని చీమ
చీమ కుట్టెను రామ
రామయ్య వంటోడు చీమయ్య ఓ వనజ !
శ్రమ జీవిగా తాను
తానె సాగును లైను
లైనుగా కదులుతూ సేకరణ ఓ వనజ !
తీపి మిఠాయి చేరు
చేరి కొరుకుతు జోరు
జోరుగా తరలించు పుట్టకే ఓ వనజ !
తనదారి కడ్డుగా
అడ్డొస్తె కుట్టుగా
కుట్టుతూ పోరులో కసిచూపు ఓ వనజ !
వేసవిన శ్రమజేయు
శ్రమ తిండి జమచేయు

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి