ఎండాకాలం సమస్యలు; పి . కమలాకర్ రావు

 ఈ కాలంలో కొద్దిపాటి ఎండ తగిలినా శరీరంలోనుండి శరీరం నుండి వేడి సెగలు వస్తుంటాయి.
చల్లని కూల్డ్రింకులు ఎక్కవ మంది ఇష్టపడి త్రాగుతుంటారు. కానీ దీనివల్ల తాత్కాలిక ఉపశమనమే.
 ఒంట్లోని వేడి పూర్తిగా తగ్గించు కోవడానికి, కొన్ని గోరింటాకులను (మైదాకులు )సేకరించి బాగా కడిగి
నీళ్ళల్లో వేసి బాగా మరిగించి, అందులో తాటిబెల్లం లేక బెల్లం వేసి చల్లారిన తరువాత పాలు కలిపి త్రాగాలి. ఇది శరీరంలో మంచి చల్లదనాన్ని తీసుకొస్తుంది.
దీనికి anti bacterial లక్షణాలు
ఉండడం వల్ల ఆరోగ్యానికి మంచిది.
2. కొన్ని వేప పూలను గాని వేప మొగ్గలను గాని తెచ్చి బాగా కడిగి
నీటిలో వేసి కొన్ని అల్లం ముక్కలు, బెల్లం వేసి కషాయంగాకాచి చల్లార్చాలి. ఇది కూడా బాగా చలువ చేస్తుంది. ఒంట్లో పైత్యవికారాలు రానివ్వదు.ఎండల్లో కొబ్బరి నీరు కూల్డ్రింకుల కన్నా ఎంతో మేలు. పుచ్చపళ్ళ రసం కూడా చాలా ప్రయోజనకరం.
కామెంట్‌లు