సునంద భాషితం;-వురిమళ్ల సునంద,ఖమ్మం
 చాంచల్యం-వైఫల్యం..
*******
చాంచల్యం నుండే వైఫల్యాలు మొదలవుతాయి అన్నది జగమెరిగిన సత్యం.
చాంచల్యం అంటే ఒక చోట స్థిరంగా లేకుండా కదలడం.
మనసు అనేక ఆలోచనల కేంద్రకం. ఏది చేయాలన్నా, పరిపరి విధాలుగా మంచి చెడుల పర్యవసనాలు ఆలోచించి  ఓ నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. కానీ దేనినీ నిర్ణయించుకోలేక, స్థిరమైన అభిప్రాయానికి రాలేకపోవడాన్ని మానసిక లేదా చిత్త చాంచల్యం అంటారు.
అనుకున్న పనిని పూర్తి చేయలేక , నిర్దిష్ట లక్ష్యాన్ని చేరుకోలేక అపజయాల పాలవడాన్నే వైఫల్యం అంటారు.
చాంచల్యం కల వ్యక్తులే ఎక్కువగా వైఫల్యాల బారిన పడుతుంటారు. పొందవలసిన ఫలితాలను కోల్పోయి నిరాశా నిస్పృహలకు లోనవుతూ ఉంటారు.
కాబట్టి చిత్త చాంచల్యాన్ని  పోగొట్టుకునేందుకు ధ్యానం ,యోగా లాంటివి చేయాలి.ఏకాగ్రతపై దృష్టి సారించాలి.
అప్పుడే మానసిక స్థిరత్వం,సరైన నిర్ణయ సామర్థ్యం పెరిగి వైఫల్యాలు తగ్గిపోతాయి. విజయాలకు మార్గం సుగమం అవుతుంది.
 ప్రభాత కిరణాల నమస్సులతో 🙏

కామెంట్‌లు